Varun Tej Lavanya Wedding Photos :మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒకటయ్యారు. ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. లావణ్య మెడలో వరుణ్ మూడుముళ్లు వేశారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా కొణిదెల, అల్లు ఫ్యామిలీకి చెందిన స్టార్ అండ్ యంగ్ హీరోస్ అందరూ షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. ఈ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాలీవుడ్ మరో హీరో నితిన్, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా నవంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ వేడుక జరగనుంది.
Varun Tej Lavanya Tripathi Love Story : ప్రేమ కథ మొదలైందిలా.. 2017లో 'మిస్టర్' చిత్రం కోసం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మొదటి సారి కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అనంతరం ఆ తర్వాత ఏడాదే వచ్చిన 'అంతరిక్షం'లోనూ ఈ జంట కలిసి నటించింది. ఈ జర్నీలో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తమ ప్రేమను ఇంట్లో వాళ్లకి చెప్పారు.