Varun Tej Lavanya Wedding Pawankalyan :మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తంతు ముగిసింది. ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ట్రెండ్ అవుతున్నారు. కానీ వీళ్లిద్దరి పేరుతో పాటు అంతకన్నా ఎక్కువగా పవన్ కల్యాణ్ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.
వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రాజకీయ పరిస్థితుల కారణంగా.. పవన్ కల్యాణ్ ఈ వివాహ వేడుకకు హాజరవుతారా లేదా అనే అనుమానం వచ్చింది. కానీ పవన్.. సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇటలీ వెళ్తునట్లుగా కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. ఎయిర్ పోర్టులో కనిపించిన ఆయన ఆ తర్వాత వివాహ వేదిక వద్ద ఉన్నట్లు ఒక్క స్టిల్ కూడా బయటకు రాలేదు.
కాక్ టైల్ పార్టీతో మొదలైన వరుణ్ తేజ్ పెళ్లి సందడిలో పవన్ తప్ప మిగతా మెగా ఫ్యామిలీ అంతా కనిపించింది. ఫొటోలు బయట చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత హల్దీ ఫంక్షన్ జరిగింది. మెహందీ ఫంక్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ మూడు ఈవెంట్లలో మెగా హీరోలంతా కనిపించారు కానీ పవన్ మొహం కనపడేలా మాత్రం ఒక్క ఫొటో రాలేదు. వరుణ్ తేజ్‌ను ఓపెన్ టాప్ కారులో వివాహ వేదిక వద్దకు సంప్రదాయబద్దంగా తీసుకొచ్చే సమయంలోనూ పవన్ పిక్స్ లేవు.