Varun Tej Lavanya Tripati Wedding : టాలీవుడ్ క్యూట్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంట హైదరాబాద్‌లోని ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర షో రూమ్‌లో కనిపించి సందడి చేశారు. చూస్తుంటే ఈ ఇద్దరూ తమ పెళ్లి డ్రెస్ కోసం షాపింగ్ చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
Varun Tej Lavanya Tripathi Marriage Venue : అయితే ఇటలీలోని ఓ ప్రముఖ ఫ్యాలెస్‌లో వరుణ్, లావణ్యల వివాహం జరగనుందని సమాచారం. ఓ చిన్న సెంటిమెంట్ కారణంగా ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వరుణ్, లావణ్యల ప్రేమకు పునాది పడింది ఇటలీలోనేట. ఈ ఇద్దరు జంటగా నటించిన 'మిస్టర్' సినిమా షూటింగ్ అక్కడే జరిగింది. ఇక షూటింగ్ కోసం కోసం ఇటలీ వెళ్లిన వరుణ్, లావణ్యలు..అక్కడే స్నేహితులయ్యారట. ఆ బంధం కాస్త కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. దీంతో ప్రేమ పుట్టిన చోటో పెళ్లి చేసుకుందామంటూ ఈ ఇద్దరు నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇరు కుటుంబాలు కూడా ఈ డెసిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
Varun Tej Lavanya Tripati Wedding Date : ఈ క్రమంలో నవంబరు నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలిసింది. నవంబర్ 1వ తేదీని లాక్ చేసినట్లు తెలిసింది. ఇరు కుటుంబల సమక్షంలో మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లనున్నారట.