Varun Tej Lavanya Tripathi Marriage : మెగా ఫ్యామిలీలో మరి కొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే జూన్ 9న మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ.. పెళ్లి ఎప్పుడో జరగనుందో స్పష్టత రాలేదు. వాస్తవానికి ఆగస్ట్‌లోనే జరగాల్సి ఉందని, కానీ వరుణ్ నటించిన కొత్త సినిమా 'గాంఢీవధారి అర్జున' రిలీజ్ సహా ఇతర కారణాల వల్ల కాస్త ఆలస్యంగా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే 'గాంఢీవధారి అర్జున' సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మూవీటీమ్.. ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న 'సుమ అడ్డా' (Suma Adda latest episode) షోకు కంటెస్టెంట్లుగా హాజరై సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో వరుణ్.. లావణ్య గురించి మాట్లాడారు.
షోలో స్క్రీన్‌పై వరుణ్-లావణ్య ఎంగేజ్మెంట్ పిక్ చూపిస్తూ.. 'వరుణ్ ఫోన్లో లావణ్య నెంబర్ ఏమని ఉందో' అని అడగగా.. 'లావన్'(LAVN) అని వరుణ్ బదులిచ్చారు. 'రిలేషన్ షిప్ మొదలయ్యాకా మార్చారా లేదంటే ముందేనా అలా పెట్టుకున్నారా అని సుమ అడగగా.. తనే మార్చింది నా ఫోన్ తీసుకుని అంటూ నవ్వించారు. 'లావణ్యకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో' అని ఇంకో ప్రశ్న అడగగా.. 'గుర్తులేదు.. చాలా ఏళ్లు అయిందా కదా మొదలై' అంటూ వరుణ్ చెప్పగా.. 'మాకు మొన్నే తెలిసిందిగా' అంటూ సుమ నవ్వించారు.