Varun Tej Lavanya Tripathi : టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్.. మణికొండలోని నాగబాబు నివాసంలో ఈ వేడుక జరిగింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ ఎంగేజ్మెంట్లో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేశారు.
Varun Tej Lavanya Tripathi Engagement : 'Found my Lav' అంటూ వరుణ్, 'Found my Forever' అంటూ లావణ్యలు తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ ఫ్యామిలీలు నాగబాబు ఇంటికి వెళ్తున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా ద్వారా వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
అల్లు అరవింద్ మాటలు నిజం చేసిన లావణ్య
Lavanya Tripathi Allu Aravind : అయితే వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం నేపథ్యంలో గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా అల్లు అరవింద్ లావణ్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉత్తరాది నుంచి వచ్చిన లావణ్య, తెలుగు చక్కగా నేర్చుకుని మాట్లాడుతుందని, ఇక్కడే ఓ అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుందన్నారు.
ఆయన మాటలను అక్షరాలా నిజం చేసింది లావణ్య త్రిపాఠి. అదీ వారి కుటుంబానికి చెందిన అబ్బాయితోనే మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ కావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ వీడియో షేర్ చేస్తూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి శుభాకాంక్షలు చెప్తున్నారు.
2016 నుంచి ప్రేమాయణం..
Varun Tej Lavanya Tripathi Love Story : వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం విషయం ప్రేక్షకులకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు. ఇప్పటికే ఈ విషయం చాలా మంది తెలుసు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి 'మిస్టర్' అనే సినిమాలో నటించారు.ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. కానీ, వరుణ్, లావణ్యలు మాత్రం అప్పుడే లవ్‌లో పడ్డారట. ఈ సినిమా తర్వాత 'అంతరిక్షం' అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది.
అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతోంది. వీరి డేటింగ్ వ్యవహారంపై వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్‌కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్యల పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రేమ పుట్టిన చోటే పెళ్లి!
Varun Tej Lavanya Tripathi Marriage : అయితే ఇటలీలోని ఓ ప్రముఖ ఫ్యాలెస్‌లో వరుణ్, లావణ్యల వివాహం జరుగబోతుందని సమాచారం. ఓ చిన్న సెంటిమెంట్ కారణంగా ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట. వరుణ్, లావణ్యల ప్రేమకు పునాది పడింది ఇటలీలోనేట. మిస్టర్ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన వరుణ్, లావణ్యలు..అక్కడే స్నేహితులుగా మారారట. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పుట్టిన చోటో పెళ్లి చేసుకుందామని ఇద్దరు నిర్ణయించుకున్నారని తెలిసింది. మెగా ఫ్యామిలీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో వీరి పెళ్లి ఉంటుందని టాక్ నడుస్తోంది.