తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Varun tej gandeevadhari arjuna : వరుణ్​ క్లాసిక్ వింటేజ్​ కార్​.. దీని వెనక పెద్ద కథే ఉందిగా.. ఏంటో తెలుసా?

Varun tej gandeevadhari arjuna : మెగా హీరో వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్​లో 'గాండీవధారి అర్జున' అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్లాసిక్​ వింటేజ్​ కారును వినియోగించారు. సినిమాలో ఆ కారు కూడా కీలక పాత్ర పోషించిందట. ఆ వివరాలు..

Varun tej vintage car
Varun tej gandeevadhari arjuna : వరుణ్​ క్లాసిక్ వింటేజ్​ కార్​..

By

Published : Aug 6, 2023, 4:14 PM IST

Varun tej gandeevadhari arjuna : మెగా హీరో వరుణ్ తేజ్.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్​లో 'గాండీవధారి అర్జున' అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1960ల కాలం నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో.. అప్పటి వాతావరణాన్ని క్రియేట్​ చేస్తూ సినిమాను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారు. ​ అదనపు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ప్రతి షెడ్యూల్​ను చిత్రీకరిస్తున్నారు.

రీసెంట్​గానే యూఎస్​ఏలో ఓ కీలకమైన యాక్షన్​​ సీక్వెన్స్​ షెడ్యూల్​ను పూర్తి చేశారట. చిత్రంలోని కీలక పాత్రలపై ఈ ఇంపార్టెంట్​ షెడ్యూల్​ను షూట్​ చేశారట. ఈ చిత్రంలో ఓ వింటేజ్​ కార్​ను కూడా స్పెషల్​గా వినియోగించారని తెలిసింది. ఆ కారు కూడా ఓ కీలక పాత్రను పోషించిందని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు.

అది 1969 కాలం నాటి ముస్టంగ్​ మెక్​ 1 మోడల్​​. చాలా రీసెర్చ్​ చేసి చివరగా ఈ కారును ఫైనలైజ్​ ​ చేశారట ప్రవీణ్. ఆ వింటేజ్​ కారును యూకేలోని ఓ 80ఏళ్ల వృద్ధుడు దగ్గర నుంచి తీసుకున్నట్లు ప్రవీణ్ తెలిపారు. ఆ పెద్దాయన తన కారును టీనేజీలో ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా కొనుగోలు చేశారట. అయితే ఈ వింటేజ్​ కారు.. సినిమాలోని హీరో పాత్రతో పాటు సమానంగా జర్నీ చేస్తుందని, దాని పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని కూడా చెప్పుకొచ్చారు ప్రవీణ్​ తెలిపారు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్​ను బాగా ఎలివేట్ కూడా చేస్తుందని అన్నారు. ఆ కారులో లేటెస్ట్​ ఇంజిన్​ను అమర్చడంతో పాటు ఎన్నో కీలక మోడిఫికెషన్స్​ చేసి తీర్చిదిద్దినట్లు చెప్పారు. మొత్తంగా ఆ కారును తాము అనుకున్న విధంగా రీమోడల్ చేయడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు.

Gandeevadhari arjuna movie cast : ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్​లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథనాయికగా కనిపించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్​గా సినిమా రూపొందుతోంది. వరుణ్‌ సెక్యురిటీ ఎక్స్‌పర్ట్‌గా కనిపించనున్నారని తెలిసింది. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి :

వరుణ్ - లావణ్య పెళ్లి.. ముహూర్తం ఫిక్స్... ఆ నెలలోనే !

వరుణ్- లావణ్య లవ్‌స్టోరీని ఎప్పుడో పసిగట్టిన అల్లు అరవింద్!.. ప్రేమ పుట్టిన చోటే పెళ్లి?

ABOUT THE AUTHOR

...view details