Varun Tej and Lavanya Tripathi Marriage : మెగా ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత, నటుడు, మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయబోతున్నారని నెట్టింట్లో వార్తలులో చక్కర్లు కొడుతున్నాయి.
గత కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సోమవారం నుంచి సోషల్ మీడియాలో మరీ ఎక్కువయ్యాయి. దీంతో వీరి పెళ్లి విషయం మరో సారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరికి జూన్‌లో నిశ్చితార్థం జరుగుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనుందని ఆ వార్తల సమాచారం.
తన తదుపరి ప్రాజెక్ట్ 'డెడ్ పిక్సెల్స్' (Dead Pixels) ప్రమోషన్స్‌లో గత కొన్నిరోజుల నుంచి బిజీగా పాల్గొంటున్నారు నటి నిహారిక. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. వరుణ్- లావణ్య విషయంపై యాంకర్ ప్రశ్నించారు. దీనిపై స్పందించేందుకు నిహారిక అసహనం వ్యక్తం చేశారు. 'ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం 'డెడ్ పిక్సెల్స్' గురించే చర్చించాలనుకుంటున్నా' అని బదులిచ్చారు.