Varun Lavanya Marriage : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ కుటుంబసభ్యులతో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించారు. వీరందరూ వరుణ్- లావణ్య పెళ్లి వేడుకల కోసం ఇటలీకి బయలుదేరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
నవంబర్ 1న వరుణ్ -లావణ్య పెళ్లి జరగనునున్న నేపథ్యంలో ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య కూడా పయనమయ్యారు. ఇక మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేడు వెళ్లనున్నట్లు సమాచారం.
డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ వేడుక జరగనుండగా.. దీనికి సంబంధించిన పనులు అప్పుడే మొదలయ్యాయి. ఇక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 30న కాక్‌టేల్ పార్టీతో మొదలై 31న హల్దీ, మెహందీ ప్రోగ్రాంస్ను నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవంబర్ 1న అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వరుణ్- లావణ్య ఒక్కటవ్వనున్నారు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చాక నూతన వధూవరులు నవంబర్ 5న సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
Varun Lavanya Wedding Card : తాజాగా వీరి పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సిల్వర్ కలర్‌లో ఉన్న ఆ కార్డు చూడటానికి ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది. అందులో మొదట వరుణ్ తాత, నాన్నమ్మల పేర్లను పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. ఈ పేర్లతో పాటు వరుణ్ తల్లిదండ్రుల పేర్లు నాగబాబు, పద్మజ, లావణ్య తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాఠి పేర్లు కూడా పెళ్లి కార్డులో ఉన్నాయి. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డులో తమ స్టార్స్ పేర్లు చూసి తెగ సంబరపడుతున్నారు.
Varuntej Lavanya Tripathi Pre Wedding Party : రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా.. తాజాగా అల్లు వారి ఇంట్లో మరో గ్రాండ్ పార్టీ జరిగింది. కాబోయే వధూవరులకు అభినందనలు తెలుపుతూ.. హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబసభ్యులతో పాటు హీరో నితిన్, ఆయన సతీమణి షాలినీ, నటి రీతూవర్మ, పలువురు సన్నిహితులు ఈ పార్టీకి హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "త్వరలో జరగనున్న వరుణ్ - లావణ్య పెళ్లి సందర్భంగా మా ఇంట్లో ఓ పార్టీ జరిగింది" అని రాసుకొచ్చారు.
Varun Tej Lavanya Pre Wedding : చిరంజీవి ఇంట్లో వరుణ్- లావణ్య ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్.. మస్త్ ఎంజాయ్ చేశారుగా!
Varun Tej Lavanya Tripati Wedding : పెళ్లి షాపింగ్‌లో వరుణ్-లావణ్య బిజీ.. క్యూట్ వీడియో చూశారా ?