Varun Lavanya Marriage Photos : ఇటలీలోని టస్కానీ వేదికగా టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఒకటయ్యారు. నవంబర్ 1న అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మెగా బ్రదర్స్‌తో పాటు అల్లు కుటుంబం, నితిన్ దంపతులు ఇలా అందరూ ఇన్‌స్టా వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేస్తున్నారు. కొత్త జంటకు విషెస్ చెప్తున్నారు. అలా తాజాగా వరుణ్ తేజ్ తండ్రిస నటుడు నాగబాబు కూడా ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు ఉన్నారు. ఇక ఈ ఫొటోతో పాటు ఆయన ఓ ఎమోషనల్ నోట్ రాశారు.
"ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా.. మా మధ్య ఉన్న అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు అంతకు మించింది. మా మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల కంటే లోతైన అనుబంధమే చాలా ముఖ్యమైనది. ప్రేమతో కూడిన ఎన్నో మధుర క్షణాలతో ఈ బంధం ముడిపడి ఉంది. ఇది ఎప్పటికీ విడదీయరానిది. బలమైనది. దీనికి నేనెంతో విలువనిస్తాను" అని నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ పోస్ట్‌ను చూసిన మెగా ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. 'మెగా ట్రయో ఇన్ వన్ ఫ్రేమ్', 'పిక్చర్ పర్‌ఫెక్ట్', 'పవన్ స్వాగ్ సూపర్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.