Varun Lavanya Marriage :మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరో రోజులో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న పెళ్లి జరగనుంది. ఇటలీలో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే మెగా-అల్లు ఫ్యామిలీ అక్కడికి చేరుకుంది. అయితే వరుణ్-లావణ్యల పెళ్లి మూడు రోజుల పాటు సాగనుంది.
ఇందులో భాగంగా మొదటి రోజు అక్టోబర్ 30 రాత్రి.. కాక్‌టెయిల్స్ పార్టీతో ప్రారంభమైంది. మెగా ఫ్యామిలీ, వారికి అత్యంత దగ్గరి బంధువులు ఈ కాక్ టెయిల్ పార్టీలో పాల్గొని సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇందులో వరుణ్, లావణ్య వైట్ కలర్ డ్రెస్‌లో మెరవగా.. రామ్‌చరణ్ ఉపాసన వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో కనువిందు చేశారు. అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ బ్లాక్ కలర్ సూట్లో స్టైలిష్‌గా కనిపించారు. ఇక ఇవి చూసిన మెగా అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తూ #VarunLav హ్యాష్‌ట్యాగ్‌ను ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు.
ఇక అక్టోబర్ 31న(నేడు) హల్దీ ఫంక్షన్ జరగనుంది. వరుణ్, లావణ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ హల్దీ, మెహందీ ఫంక్షన్‌లో పాల్గొంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసుపు పూసుకుని అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పెళ్లికి ముందు ఈ సంబరం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎంతో మెమరబుల్‌గా ఉంటుంది. దీన్ని కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశారట.