Varun Lavanya Haldi Photos :మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి నవంబరు 1న ఇటలీలో జరగనుంది. అందులో భాగంగా అక్టోబరు 30న కాక్టెయిల్ పార్టీ జరిగగా.. 31న హల్దీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధిత ఫొటోలు బయటకు వచ్చాయి. వాటిని మెగా అభిమానులు నెట్టింట్లో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో అవి కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. వాటిలోని ఓ ఫొటోలో వరుణ్, లావణ్య ఒకరినొకరు చూసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో చిరంజీవి, ఇంకో ఫొటోలో నాగబాబు ఆయన సతీమణితో కనిపించారు. కాగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న ఈ మెగా జంట హల్దీ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు, కాక్‌టేల్ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొట్టాయి.
Varun Tej Marriage Italy : పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇప్పటికే ఇటలీ చేరుకున్నాయి. హీరో నితిన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కూడా వివాహానికి హాజరుకానున్నారు. ఇటలీలో చిన్నగా రిషెప్షన్ ఉంటుంది. ఇక సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో నవంబరు 5న రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 'హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం. కానీ, ప్రైవేట్ వ్యవహారంగా ఉంచాలనుకోవడం వల్ల అది ఇక్కడ సాధ్యంకాదు. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాం'' అని వరుణ్ తేజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.