తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మాకు విడాకులు కావాలి: కియారా అడ్వాణీ, వరుణ్ ధావన్ - kiara advani latest pics

Varun Dhawan Kiara Advani: తమకు విడాకులు కావాలంటున్నారు నటి కియారా అడ్వాణీ, బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కూడా అనుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే?

Jug jugg Jeeyo
Kiara Advani

By

Published : May 22, 2022, 5:02 PM IST

Varun Dhawan Kiara Advani: విడాకులు తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారు హాట్ బ్యూటీ కియారా అడ్వాణీ, బాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ ధావన్. అయితే వారికి ఎప్పుడు పెళ్లి అయ్యిందని అనుకోకండి. ఇది నిజ జీవితంలో కాదు. వారిద్దరూ కలిసి నటిస్తున్న 'జుగ్​జుగ్​ జీయో' సినిమాలో. విడాకుల నేపథ్యంలో కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్​ విడుదలై ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

'జుగ్​జుగ్​ జీయో'

రాజ్​ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో అనిల్ కపూర్, నీతూ కపూర్..​ వరుణ్ తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. కరణ్ జోహార్, హీరూ, అపూర్వ మెహతా నిర్మాతలు. జూన్ 24న ఈ సినిమాలో థియేటర్లలో విడుదలకానుంది.

'ఆర్​ఆర్ఆర్​'పై మెక్సికన్​ దర్శకుడి ప్రశంస:దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్​'పై ప్రశంసల వర్షం కురిపించారు మెక్సికన్ దర్శకుడు, ఏనిమేటర్ జార్జ్ ఆర్. గుటిరెజ్. సినిమా అద్భుతంగా ఉందని, లోతైన సాంస్కృతిక మూలాలను పరిచయం చేసిందని కొనియాడారు. ఈ సినిమాను తన 84 ఏళ్ల తండ్రికి చూపించగా, ఆయన కూడా ఎంతో బాగా ఆస్వాదించారని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

'ఆర్​ఆర్ఆర్​'

సినిమా చూసిన సందర్భంగా ఏదైన భారతీయ వంటకాన్ని రుచి చూడాలనుకుంటున్నట్లు తెలిపారు గుటిరెజ్. ఆయన ట్వీట్​కు బదులిస్తూ.. ధన్యవాదాలు తెలిపిన 'ఆర్ఆర్ఆర్' బృందం.. హైదరాబాద్ బిర్యానీ తినాలని సూచించింది.

ఇదీ చూడండి:కమల్​హాసన్​ డేట్స్​ కోసం జక్కన్న, ప్రశాంత్​ నీల్​ ప్రయత్నాలు!

ABOUT THE AUTHOR

...view details