తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు విజయ్ దళపతి అంటే తెలియనివారు ఎవరు ఉండరు. ఆయనకి అంత క్రేజ్ ఉంది మరి.. విజయ్ నటన, డ్యాన్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అటు తమిళంతో పాటు, ఇటూ తెలుగు ఇండస్ట్రీలోను తనదైన ముద్ర వేసుకున్నారు విజయ్. ప్రసుతం దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మిస్తున్న సినిమా 'వారసుడు'లో హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో 'వారిసు' పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్.. పీవీపీ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే అసలు విషయం ఎంటంటే?.. ఈ సినిమాతో విడుదలకు ముందే దిల్‌రాజు అండ్ కో 30 కోట్లు లాభం పొందారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కళ్ళు చెదిరేలా 'వారసుడు' ప్రీ రిలీజ్ బిజినెస్
తమిళ్‌తో పాటు తెలుగులో విజయ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. బాక్సాఫీసుల్లో ఆయన సినిమాలు వందకోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అందుకోసం, తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో రూ. 72 కోట్ల నుంచి రూ. 75 కోట్ల మధ్య సొంతం చేసుకుందట. ఓవర్సీస్ రిలీజ్ రైట్స్‌ను రూ. 38 కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయ్యిందని.. తెలుగు, తమిళ భాషల హక్కులను సుమారు 150 కోట్లకు అటు ఇటుగా అమ్మేశారని ప్రచారం జరుగుతోంది. ఆడియో రైట్స్ టీ సిరీస్ తీసుకుంది. ఐదు కోట్లకు ఆ డీల్ కుదిరిందని బాలీవుడ్ టాక్.
తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో దిల్‌రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి లాభం అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.