Varalaxmi Sarathkumar Emotional Post: వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా యశోద సినిమాలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. చిత్రపరిశ్రమకు వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈ నటి సోషల్‌మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్@10 ఏళ్లు.. సినీ జర్నీపై యశోద నటి ఎమోషనల్ పోస్ట్ - varalaxmi sarathkumar latest news
యశోద సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు వరలక్ష్మీ శరత్ కుమార్. చిత్రపరిశ్రమకు వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
"పదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. ఈ దశాబ్ద కాలం నా ప్రయాణం సులభంగా, అనుకున్న విధంగా సాగిందా అంటే.. కాదనే చెప్పాలి. ఎన్నో తిరస్కరణలకు గురయ్యాను. అయితే.. ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. ఎంతో కృషి చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే 45 సినిమాల్లో నటించి నేనెంటో నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. అలాగే నన్ను తిరస్కరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటూ తనకు మద్దతు ఇస్తూ కష్టకాలంలో అండగా నిలిచిన దర్శక నిర్మాతలకు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.