తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Varalaxmi Sarathkumar Drugs : నటి వరలక్ష్మికి ఎన్​ఐఏ నోటీసులు!.. క్లారిటీ ఇదిగో.. - నటి వరలక్ష్మి శరత్‌కుమార్

Varalaxmi Sarathkumar Drugs Case NIA : డ్రగ్స్​ కేసులో నటి వరలక్ష్మి శరత్ ​కుమార్​కు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) నోటీసులు పంపినట్లు వార్తలొచ్చాయి. కొన్నాళ్ల పాటు ఆమె దగ్గర పనిచేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు.. అనంతరం ఆమెకు కూడా విచారించనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై నటి వరలక్ష్మి స్పష్టత ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

varalaxmi-sarathkumar-drugs-case-nia-varalaxmi-sarathkumar-clarity-on-nia-notice
నటి వరలక్ష్మికి ఎన్​ఐఏ నోటీసులు

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 8:48 PM IST

Varalaxmi Sarathkumar Drugs Case NIA :డ్రగ్స్​ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) నుంచి తనకు నోటీసులు వచ్చాయనే వార్తలను నటి వరలక్ష్మీ శరత్ కుమార్​ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదని తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డ్రగ్స్​ కేసులో అరెస్టైన ఆదిలింగం.. తన వద్ద కొన్నాళ్ల పాటు పనిచేసినట్లు ఆమె పేర్కొన్నారు.

వరలక్షికి ఎన్​ఐఏ నోటీసులు పంపినట్లు కొలీవుడ్​ మీడియాలో మంగళవారం పలు కథనాలు వెలువడ్డాయి. కొచ్చిలోని కార్యాలయానికి ఆమె హాజరుకావాలని అధికారులు ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. డ్రగ్స్​ వ్యవహారంలో వరలక్షి పాత్ర ఏమైనా ఉందా? అని అధికారులు అనుమానిస్తున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయా వివరాల కోసం వరలక్ష్మికి ఎన్​ఐఏఅధికారులు సమన్లు జారీ చేశారని.. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని తీసుకుంటారని కథనాలొచ్చాయి. ఈ విషయం వరలక్ష్మి వరకు చేరడం వల్ల దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు."ఆదిలింగం నా దగ్గర ఫ్రీలాన్స్‌ మేనేజరుగా సుమారు 3 ఏళ్లు పనిచేశాడు. ప్రస్తుతం అతడితో ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదు. ఈ వార్త నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఈ కేసులో తాను పూర్తిగా సహకరిస్తాను." అని వరలక్షి తెలిపారు.

నటి వరలక్షి విడుదల చేసిన ప్రకటన

ప్రస్తుతం ఆరు సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ..
Actress Varalaxmi Sarathkumar :ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది వరలక్ష్మి. అనంతరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌, క్రాక్‌, నాంది, వీరసింహారెడ్డి తదితర తెలుగు చిత్రాల్లో నటించి.. విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం కలిపి ఆరు సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన వీరసింహారెడ్డి సినిమాలో తనదైన నటనతో వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టేశారు. బాలయ్య, వరలక్ష్మి మధ్య సాగే సన్నివేశాలకు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అలాగే అల్లరి నరేష్​ హీరోగా తెరకెక్కిన 'నాంది' సినిమాలో వరలక్ష్మి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అప్పటి నుంచి వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. అలాగే రవితేజ హీరోగా నటించిన చిత్రం క్రాక్​లో వరలక్ష్మి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Farmers Protest in Secretariat : సచివాలయం ఆరో అంతస్తు నుంచి దూకిన రైతులు

థర్మోకోల్​ షీట్​ 'పడవ'పై స్కూల్​కు వెళ్తున్న విద్యార్థులు.. రోజూ ఇదే సీన్!

ABOUT THE AUTHOR

...view details