Varalakshmi Sankranti Movies: యంగ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ సహాయ పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రిలీజైన హనుమాన్ సినిమాలోనూ హీరో తేజ సజ్జకు సోదరి క్యారెక్టర్లో అదరగొట్టేసింది. గ్లామరస్ పాత్రల్లో కాకుండా లేడీ విలన్‌గా వరలక్ష్మి పెర్ఫార్మెన్స్కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే ఈమె నటించిన సినిమాలు ఇప్పటికి మూడుసార్లు సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టాయి. దీంతో వరలక్ష్మి సంక్రాంతి లక్కీ ఛార్మ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఆమె సంక్రాంతికి వచ్చి విజయం సాధించిన సినిమాలేవంటే?
క్రాక్:రవితేజ బ్లాక్‌బస్టర్ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఒదిగిపోయింది వరలక్ష్మి. ఈ సినిమాలో వరలక్ష్మి పాత్ర దాదాపు మెయిన్ విలన్‌కు సమానంగా ఉంటుంది. స్క్రీన్ షేరింగ్ టైమ్ కూడా ఎక్కువే. ఈ సినిమా 2021లో సంక్రాంతి బరిలో నిలిచి బంపర్ హిట్ కొట్టింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రుతిహాసన్ కంటే వరలక్ష్మి పాత్రే ఎక్కువ పాపులర్ అయ్యింది.
వీర సింహారెడ్డి: నటసింహం నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి మూవీతో సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ సినిమాలో వరలక్ష్మి, బాలకృష్ణకు చెల్లి పాత్రలో నటించింది. ఈ మూవీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్‌లో నటనతో వరలక్ష్మి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కూడా శ్రుతి హాసన్ మెయిన్ హీరోయిన్గా నటించడం విశేషం.