KGF 2 song released: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' ఒకటి. కన్నడ నటుడు యశ్ కథానాయకుడిగా విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'కేజీఎఫ్-1'కు ఇది స్వీకెల్. వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రబృందం తాజాగా మరో పాటను అన్ని భాషల్లో విడుదల చేసింది. తెలుగులో 'యదగర యదగర' అంటూ సాగే ఈ గీతం మనసును హత్తుకునేలా ఉంది. కాగా, ఈ 'కేజీఎఫ్ 2'కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఈ చిత్రంలో 'అధీరా' అనే బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సీనియర్ నటి రవీనాటాండన్, రావురమేష్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు.
Vijay Vamsi paidipally new movie: కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ తన 66వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నేడు(బుధవారం) చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్, హీరోయిన్ రష్మిక సహా దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు. కాగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్-పూజా హెగ్డే కలిసి నటించిన 'బీస్ట్' ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదల కానుంది.