వాల్తేరు వీరయ్య.. పవర్‌ఫుల్‌గా రవితేజ ఫస్ట్ గ్లింప్స్.. యాక్షన్, డైలాగ్స్ అదిరిపోయాయ్! - chiranjeevi Valteru veerayya
చిరంజీవి వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో నటించిన రవితేజకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది మూవీటీమ్. ఆ వీడియో అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్యలో ఓ కీలక పాత్రలో నటించిన రవితేజ టీజర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. మేకపిల్లను పట్టుకొని రౌడీల భరతం పడుతోన్న రవితేజ వాల్తేర్ వీరయ్య మాస్ ఎంటర్ టైనర్ గా ఎలా ఉండబోతుందో చూపించాడు. గతంలో అన్నయ్య చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా నటించిన రవితేజ... మళ్లీ చాలా కాలం తర్వాత తెరను పంచుకోవడంతో అటు మెగా అభిమానులు, ఇటు రవితేజ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.