బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ప్రస్తుతం ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సినిమాకు సంబంధించిన మొదటి పాటను 23 నవంబర్ 2022న సాయంత్రం 4.50 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. 'బాస్ పార్టీ' అనే పాటను విడుదల చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన పోస్టర్లో మెగాస్టార్ ఊరమాస్ స్టెప్పులేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. చిరు.. లుంగీ కట్టుకుని, ఉంగరాలు, కడియం, చెవి పోగుతో చిరు మాస్ గెటప్‌లో అదిరిపోయారు. డీఎస్పీ బీట్స్.. బాస్ స్టెప్స్ తోడైతే ఫ్యాన్స్‌కు పూనకాలే.
మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. చిత్ర బృందం ఈ సన్నివేశాలు తెరకెక్కించడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.