Ustad Bhagat Singh Glimpse : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్‌సింగ్'. యువ నటి శ్రీలీల హీరోయిన్. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఫస్ట్ గ్లింప్స్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, సరిగ్గా పదకొండేళ్ల క్రితం గబ్బర్‌సింగ్ సినిమా కూడా ఇదే తేదీన విడుదలైంది. ఆ సినిమాకు ఎక్స్ట్రా డోస్‌లా.. 'ఉస్తాద్ భగత్‌సింగ్'ను తెరకెక్కించారు హరీశ్ శంకర్. ఇక, ఈ గ్లింప్స్‌నకు బాక్స్‌లు బద్దలైపోయే మ్యూజిక్ ఇచ్చారు 'రాక్ స్టార్' దేవీశ్రీ ప్రసాద్.
వామ్మో పవన్ కల్యాణ్ మాస్ జాతర.. 'ఈ సారి పెర్ఫామెన్స్ బద్దలైపోద్ది' - ustad bhagath singh
Ustad Bhagat Singh Glimpse : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. మీరూ చూసేయండి.

'ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో.. అధర్మము వృద్ధినొందునో.. ఆయా సమయముల యందు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను' అంటూ ఘంటసాల గీతా సారము చెబుతుండగా.. 'భగత్.. భగత్‌సింగ్. మహంకాళి పోలీస్ స్టేషన్. అత్తర్ గంజ్.. పాతబస్తీ' అంటూ ధర్మ రక్షుకుడి అవతారములో అదరగొట్టారు పవన్ కల్యాణ్. లుంగీ కట్టి నిలువు బొట్టు పెట్టి.. ఊర మాస్ గెటప్‌లో పవన్ కనిపించారు. పవర్ స్టార్ ఈ సినిమాలో ఎస్ఐ పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్‌లో ఓ సీన్లో పోలీస్ స్టేషన్లో కోపంతో ఊగిపోయారు. దీంతో ఈ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్'కు ఎక్స్ట్రా డోస్‌లా ఈ సినిమా ఉండే అవకాశముంది. ఈ మేరకు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. చివర్లో పవన్ చెప్పిన డైలాగ్ ఈ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది. 'ఈ సారి పెర్ఫామెన్స్ బద్దలైపోద్ది.. సాలా' అంటూ పవన్ చెప్పిన ఊర మాస్ డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఇదే కాకుండా, ఈ మధ్య వచ్చిన పవన్ సినిమాల కన్నా.. ఈ చిత్రంలో ఆయన మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
ఈ గ్లింప్స్ విడుదల చేయడానికి మేకర్స్ ఓ ఈ వెంట్‌ను ఏర్పాటు చేశారు. దాని సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్లో వద్దకు పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. బ్యాండుతో ఉర్రూతలూగించారు. అభిమానుల కోలాహలం మధ్య ఈ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇటీవల వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయనకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా ఉండగా..చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
TAGGED:
ustad bhagath singh