తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Ustaad Bhagat Singh Shooting : 'ఉస్తాద్' షూటింగ్ షురూ.. యాక్షన్ మోడలోకి పవన్​.. కొత్త పోస్టర్​ అదిరింది - ustaad bhagat singh shooting starts

Ustaad Bhagat Singh Shooting : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పునఃప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీటీమ్​ సరికొత్త పోస్టర్​ను రిలీజ్ చేసింది. ఆ సంగతులు..

Ustaad Bhagat Singh Shooting : ఉస్తాద్ షూటింగ్ షురూ.. యాక్షన్ మోడలోకి పవన్​.. కొత్త పోస్టర్​ అదిరింది
Ustaad Bhagat Singh Shooting : ఉస్తాద్ షూటింగ్ షురూ.. యాక్షన్ మోడలోకి పవన్​.. కొత్త పోస్టర్​ అదిరింది

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 4:59 PM IST

Updated : Sep 7, 2023, 6:16 PM IST

Ustaad Bhagat Singh Shooting : రాజకీయాలు-సినిమాలు అంటూ ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌. రెండిటినీ బ్యాలెన్స్​ చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో మూడు షూటింగ్ దశలో ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. తాజాగా ఉస్తాద్‌ భగత్‌సింగ్​ సినిమాకు సంబంధించిన మరో కొత్త అప్డేట్ వచ్చింది.

Ustaad Bhagat SinghNew Poster : పవన్ కల్యాణ్​ ఈ సినిమా షూటింగ్​ సెట్‌లోకి అడుగుపెట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఓ సరికొత్త పోస్టర్​ను రిలీజ్ చేసింది. పవన్​ యాక్షన్ మూడ్​లోకి వెళ్లిపోయినట్లు పేర్కొంది. పవన్​పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలిపింది. పవర్ ప్యాక్డ్ సన్నివేశాలను షూట్​ చేయబోతున్నట్లు పేర్కొంది. పోస్టర్​లో పవన్​లో గన్‌ పట్టుకుని స్టైలిష్‌గా కూర్చొని సూపర్​గా కనిపించారు. 'ది ఉస్తాద్‌ ఈజ్‌ ఇన్‌ యాక్షన్‌' అని మూవీటీమ్​ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. 'గబ్బర్‌ సింగ్‌' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్‌-హరీశ్‌ శంకర్‌ కాంబోలో ఈ సినిమా రానుండటం వల్ల చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ మరోసారి పోలీస్‌ ఆఫీసర్​ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్​గా శ్రీలీల నటించనుంది. నవాబ్ షా, అశుతోష్​ రానా, గౌతమి, కేజీయఫ్ ఫేమ్ అవినాశ్, నాగా మహేశ్​, నర్రా శ్రీను, టెంపర్ వంశీ సహా పలువురు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాక్ స్టార్​ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కే దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా... అయనంక బోస్​ డీఓపీ.. చోటా కే ప్రసాద్​ ఎడిటింగ్​ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిజైనర్​గా​ ఆనంద్​ సాయి వ్యవహరిస్తుండగా.. రామ్​ లక్ష్మణ్ పోరట సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. మొత్తంగా హైక్లాస్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రం కోసం వర్క్ చేస్తోంది.

Ustad Bhagat Singh Poster : పవర్ స్టార్ ఫ్యాన్స్​కు 'ఉస్తాద్' ట్రీట్.. మాస్ మేనియా పోస్టర్ అదిరిందిగా

పవన్ మళ్లీ ఏమైంది.. థాయ్​లాండ్​కు పవర్​స్టార్​.. కన్ఫ్యూజన్​లో 'ఉస్తాద్'​ - 'ఓజీ' రిలీజ్!

Last Updated : Sep 7, 2023, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details