తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కమెడియన్​కు రూ.3.91కోట్ల జరిమానా.. 50 ఏళ్ల క్రితం నేరానికి ఇప్పుడు శిక్ష - bill cosby girl harassment case

50 ఏళ్ల క్రితం నేరం చేసిన ఓ కమెడియన్​కు ఇప్పడు శిక్ష పడింది. సుదీర్ఘం కాలం పాటు విచారించిన కోర్టు ఎట్టకేలకు అతడిని దోషిగా తేల్చింది. ఇంతకీ కమెడియన్​ ఎవరు? ఆయన చేసిన నేరం ఏమిటి?

US Comedian Bill Cosby Found Guilty Of Sexually Assaulting Minor In 1975
కమెడియన్​కు రూ.3.91కోట్ల జరిమానా.. 50 ఏళ్ల క్రితం నేరానికి ఇప్పుడు శిక్ష

By

Published : Jun 22, 2022, 7:33 PM IST

Updated : Jun 22, 2022, 10:50 PM IST

1975లో ఓ కమెడియన్​ చేసిన నేరం.. ఇప్పుడు రుజువైంది. 50 ఏళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో అమెరికన్ కమెడియన్‌ బిల్‌ కాస్బీ.. ఓ బాలికను తనను లైంగికంగా వేధించారు. కొన్ని సంవత్సరాల తర్వాత.. ఆమె బిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విచారించిన కాలిఫోర్నియాలోని కోర్టు 2022, జూన్ 21న తీర్పునిచ్చింది. బిల్‌ వేధింపులకు పాల్పిడినట్లు జ్యూరీ నిర్ధరించింది. బాధితురాలు జూడీ హుత్‌కు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. 5లక్షల డాలర్ల(రూ.3,91,28,750) నష్టపరిహారాన్ని జూడీ హుత్‌కు చెల్లించాలని ఆదేశించింది. లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు బిల్​ వయసు 36 ఏళ్లు కాగా.. బాధితురాలి వయసు 16 సంవత్సరాలు. ప్రస్తుతం బిల్​ వయసు 84 ఏళ్లు.

బిల్‌ కాస్బీ

ఇదిలా ఉంటే.. జూడీ హుత్‌ను వేధించిన సమయంలోనే.. ఆమె స్నేహితురాలిపై కూడా బిల్ వేధింపులకు పాల్పడటం గమనార్హం. ​బిల్‌ కాస్బీ.. ఇప్పటికే పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జూడీ హుత్‌ కేసులో నేరం రుజువైంది. అంతేకాదు.. 2018లో ఒక క్రిమినల్ కేసులో.. బిల్​ కటకటాలపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ విడుదలయ్యారు.

ఇదీ చదవండి:రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల తేదీ ఖరారు

Last Updated : Jun 22, 2022, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details