ఊర్వశి రౌతేలా జీవితంలో 'రిషభ్' పేరుకు చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది! టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ తన కోసం హోటల్ లాబీల్లో గంటల తరబడి వెయిట్ చేసేవాడని, తనను కలవడానికి తెగ ట్రై చేసేవాడని ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి చెప్పడం.. ఆ తర్వాత ఆమెకు పంత్ కౌంటర్ ఇవ్వడం.. ఈ క్రమంలోనే 'చెల్లెమ్మా' అని పేర్కొనడం తెగ చర్చనీయాంశంగా మారాయి. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. రిషభ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత అతడు ఉన్న హాస్పిటల్ ఫోటోను సోషల్ మీడియాలో ఊర్వశి రౌతేలా షేర్ చేయడం కూడా విమర్శలకు కారణమైంది. 'రిషభ్'ను ఊర్వశి వదలడం లేదంటూ కొందరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ విమర్శలు పక్కన పెట్టి సినిమాలకు వస్తే...
పాపం ఊర్వశి.. రిషభ్ పేరుతో ఆమెకు ఎన్ని తిప్పలో! మళ్లీ ట్రోలింగ్ షురూ!! - ఊర్వశి రౌతేలాపై నెటిజన్స్ ట్రోల్స్
రిషభ్- ఊర్వశి రౌతేలా.. ఈ రెండు పేర్లను ఇప్పట్లో వేరు చేసి చూడలేం ఏమో! ఇటీవలి కాలంలో రిషభ్ పేరుతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఊర్వశిని తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. అసలేం జరిగిందంటే?
ఊర్వశి సినిమాల్లో!
ఊర్వశి రీల్ లైఫ్‌లో కూడా రిషభ్, ఆర్పీ పేర్లు ఉన్నాయి. తాజా ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా పోస్ట్ చూశారా? రిషభ్ శెట్టి 'కాంతార 2'లో తాను నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంకేముంది? జనాలకు మంచి మెటీరియల్ దొరికినట్టు అయ్యింది! రిషభ్ శెట్టితో దిగిన ఫొటోను పోస్ట్ చేసి 'కాంతార 2'లో నటిస్తున్నట్లు ఊర్వశి రౌతేలా పేర్కొన్నారు.
ఆ ఫొటో కింద ''రిషభ్ శెట్టి హాయ్ చెబితే... రిషభ్ చాలు అని చెప్పి ఉంటుంది'' అని ఒకరు... ''అక్కా! నీ జీవితంలో ఎంత మంది 'రిషభ్'లు ఉన్నారు'' అంటూ ఇంకొకరు... ''రిషభ్ పంత్ నహీ తో రిషభ్ శెట్టి సహీ'' అంటూ మరొకరు... ''రిషభ్ పేరు చాలు... మాకు అర్థమైంది'', ''అక్క జీవితంలో అందరూ రిషభ్, ఆర్ఫీలే'' అంటూ ఇతరులు కామెంట్స్ మీద కామెంట్స్ చేశారు. రిషభ్ పేరుతో ఆమెను ఆడుకుంటున్నారు. రిషభ్, ఊర్వశి పేర్ల చుట్టూ జరిగే సోషల్ మీడియా హంగామా ఇప్పట్లో ఆగేలా లేదు.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సంక్రాంతి హిట్ 'వాల్తేరు వీరయ్య'లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో ఊర్వశి రౌతేలా కనిపించింది. గత ఏడాది తమిళ సినిమా 'ది లెజెండ్'లో నటించింది. ఇప్పుడు రామ్ పోతినేని సినిమాలో సాంగ్ చేసింది. 'బ్లాక్ రోజ్' అని తెలుగులో ఓ సినిమా పూర్తి చేసింది ఊర్వశి. అది విడుదల కావాల్సి ఉంది.