తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వారికి సంఘీభావంగా జుట్టు కత్తిరించుకున్న ఊర్వశి​.. కానీ బుక్​ అయిందిగా!

ఇరాన్‌లో హిజాబ్‌ ధారణకు వ్యతిరేకంగా పోరాడి.. ప్రాణాలు కోల్పోయిన మహిళలకు బాలీవుడ్ నటి​ ఊర్వశీ రౌతేలా సంఘీభావం తెలుపుతూ.. తన జుట్టును కత్తిరించుకుంది. అయితే ఈ విషయంలో ఆమెపై సోషల్​ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్​ జరుగుతోంది. ఎందుకంటే..

urvashi rautela iranian masha amini death
urvashi rautela iranian masha amini death

By

Published : Oct 17, 2022, 3:55 PM IST

Updated : Oct 17, 2022, 4:36 PM IST

ఇరాన్‌లో హిజాబ్‌ ఘర్షణల్లో చనిపోయిన మహిళలకు సంఘీభావం తెలుపుతూ.. బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా తన జుట్టును కత్తిరించుకుంది. హిజాబ్‌ ధరించని కారణంగా అరెస్టై పోలీసు కస్టడీలో చనిపోయిన ఇరాన్‌ యువతి మషా అమినికి మద్దతుగా జుట్టును కత్తిరించుకున్నట్లు తెలిపింది. అమినీ మృతి తర్వాత చెలరేగిన హింసలో చనిపోయిన వారికి సంఘీభావం ప్రకటించింది.

ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన అంకిత్‌ భండారీ మృతిని ఖండించి.. ఆమెకు కూడా సంఘీభావం పలికింది. ఈ మేరకు జుట్టుకత్తించుకుంటున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశీ రౌతేలా ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళలంతే ఒక్కటైతే స్త్రీ జాతికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని పేర్కొంది.

అయితే రిషభ్​ పంత్​ విషయంలో ఇప్పటికే విపరీతమైన ట్రోలింగ్​ ఎదుర్కొంటోంది ఊర్వశీ రౌతేలా. ఇప్పుడు ఈ జుట్టు కట్​ చేసుకున్న విషయంలో కూడా అదే విధంగా ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటో.. గత ఏడాది తిరుపతిలో తలనీలాలు​ సమర్పించుకున్న ఫొటో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు 'ఆస్ట్రేలియాలో ఉండి హెయిర్​​ ఎలా కట్​ చేసుకున్నావ్' అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఆమెను టీమ్ ఇండియా క్రికెటర్​ను 'కావాలనే వెంబడిస్తోంద'ని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, ఇరాన్​లో మాషా అమిని అనే మహిళా హిజాబ్​ ధారణకు వ్యతిరేకంగా పోరాడి.. పోలీసుల కస్టడీలో చనిపోయింది. ఆ తర్వాత ఇరాన్​ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ ఉద్యమం ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. మహిళల హక్కులను కాపాడుకునేందుకు ఎక్కడికక్కడ ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇరాన్​లో జరుగుతున్న ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సెలెబ్రిటీలు, స్పోర్ట్స్​ పర్సన్లు సంఘీభావం తెలుపుతున్నారు.

ఇవీ చదవండి:దర్శకుడిగా మారనున్న హీరో కార్తి.. అన్నయ్యతో సినిమా?

పిల్లి కళ్ల భామకు పెళ్లి కళ.. చారిత్రక కోటలో వివాహం.. వరుడు ఎవరంటే?

Last Updated : Oct 17, 2022, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details