తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్​ కల్యాణ్​ పవర్ ప్యాక్డ్​ ​'OG'​.. అదిరిపోయే​ అప్డేట్ వచ్చేసిందోచ్​!​ - పవన్​ కల్యాణ్​ ఓజీ సినిమా గ్లింప్స్​ వీడియో

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్ నటిస్తున్న పవర్​ఫుల్ యాక్షన్​ థ్రిల్లర్​ '#ఓజీ'​. సాహో సుజిత్​ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్​. అదేంటంటే..

pawan kalyan
pawan kalyan

By

Published : Apr 15, 2023, 4:15 PM IST

Updated : Apr 15, 2023, 5:13 PM IST

ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్న పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ఓజీ సినిమా నుంచి అప్డేట్​ వచ్చింది. మూవీ గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్ర బృందం. షూట్​ బిగిన్స్​ అంటూ అందులో ఉంది. ఈ 'పవర్​ స్టార్మ్ ఈజ్ కమింగ్​' అంటూ సాగే పాటకు పవర్​ఫుల్ బీజీఎమ్​ ఇచ్చారు. సాహో సుజిత్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్​టైనమెంట్స్​ సంస్థ నిర్మిస్తోంది. పవర్​ స్టార్​ సరసన ప్రియాంక అరుళ్​ మోహన్ ఆడిపాడనుంది. తమన్​ ఎస్​ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్​గా రవి కె చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్​గా ఎఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ముంబయిలో మొదలు పెట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా శనివారం గ్లింప్స్​ వీడియో విడుదల చేసింది. వచ్చే వారం పవన్ కల్యాణ్​ షూటింగ్​లో పాల్గొంటారని సినిమా యూనిట్​ ప్రకటించింది. ముంబయిలో జరుగుతున్న మొదటి షెడ్యూల్​లో పవన్​తో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం. ఐదు రోజుల పాటు పవన్​పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

'ఓజీ' వర్కింగ్​ టైటిల్​తో యాక్షన్ ఎంటర్టైనర్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవర్​ స్టార్ గ్యాంగ్​స్టర్ పాత్రలో కనిపించనున్నారట. మాఫియా డాన్స్ అందరూ పవన్​ను చూసి భయపడే సీన్స్​ ఈ సినిమాలో ఉన్నట్లు సమాచారం. అయితే, ముందు పవన్​కు ఓ రీమేక్​ కథ వినిపించారని అప్పట్లో చర్చ జరిగింది. ఆ తర్వాత సుజిత్ చెప్పిన స్టోరీ నచ్చడం వల్ల.. ఆ కథకే పవర్​ స్టార్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, డీవీవీ నిర్మాణ సంస్థలో పవన్​ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ బ్యానర్​లో పవర్​ స్టార్​ తొలి చిత్రం 'కెమెరామెన్​ గంగతో రాంబాబు'. ఈ సినిమా తర్వాత పదేళ్లకు మళ్లీ అదే బ్యానర్​లో సినిమా చేస్తున్నారు.

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న పవర్​ స్టార్​.. టైట్​ షెడ్యూల్​లోనూ షూటింగ్​ల్లో పాల్గొంటున్నారు. 'ఓజీ' మొదటి షెడ్యూల్​ పూర్తైన తర్వాత.. క్రిష్​ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్​ ఇండియా సినిమా 'హరిహర వీరమల్లు' షూటింగ్​లో పాల్గొంటారు​. ఆ తర్వాత 'గబ్బర్ ​సింగ్'​ డైరెక్టర్ హరీష్​ శంకర్​ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్​ భగత్​ సింగ్'​ షూటింగ్​లో పాల్గొంటారు.

Last Updated : Apr 15, 2023, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details