తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

RC15 అదిరిపోయే అప్డేట్​.. DSPతో ఊర్వశీ రౌతేలా ఏం చేసిందో తెలుసా? - వాల్తేరు వీరయ్య బాస్​ పార్టీ సాంగ్

స్టార్​ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో​ మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్​సీ 15. ఈ చిత్రం నుంచి మరో అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. మరోవైపు, చిరంజీవి బాస్​ పార్టీ సాంగ్​కు ప్రముఖ బాలీవుడ్​ నటి ఊర్విశీ రౌతేలా.. దేవిశ్రీ ప్రసాద్​తో కలిసి మాస్​ స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్​ అవుతోంది.

ram charan rc15 movie update
ram charan rc15 movie update

By

Published : Dec 27, 2022, 10:50 PM IST

మెగా పవర్ స్టార్ రామ్​చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్​ ఇండియా రేంజ్​లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దిల్​ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆర్​సీ 15 అనే వర్కింగ్​ టైటిల్​తో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చింది. కొత్త సంవత్సరం కానుకగా ఈ మూవీ టైటిల్​ను వెల్లడించనున్నట్లు సమాచారం. దీంతో పాటు రామ్​చరణ్​ ఫస్ట్​ లుక్​ కూడా విడుదల చేసే అవకాశాలున్నాయట. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించలేదు. అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
ఈ సినిమాకు తమన్ ఎస్​ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ ఆడిపాడనుంది. ఈ సినిమా భారీ యాక్షన్​ సన్నివేశాలతో పొలిటికల్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శంకర్​ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

'బాస్​ పార్టీ'కి.. దేవిశ్రీ, ఊర్వశి మాస్​ స్టెప్పులు..
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోని బాస్​ పార్టీ సాంగ్ ఇటీవలే విడుదలై అభిమానులను ఉర్రూతలుగిస్తోంది. దేవిశ్రీ మాస్​ బీట్​కు.. చిరు ఊర మాస్​ స్టెప్పులతో ఆదరగొట్టారు. ఈ పాటలో బాలీవుడ్​ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా చిరుతో ఆడిపాడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ఆ సాంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ దేవిశ్రీ ప్రసాద్​తో స్టెప్పులు వేసింది. వీరు డ్యాన్స్​ చేసేటప్పుడు స్టేజ్​ మీద సుకుమార్​ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. బాస్​ పార్టీ.. మాస్​ పాటకు ఎనర్జిటిక్​గా డాన్స్ చేస్తున్న ఆ వీడియోను ఊర్వశి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్​ అవుతోంది. అయితే, అది సంతోషం అవార్డ్స్​ ఫంక్షన్​లో డ్యాన్స్​ రిహార్సల్స్​ చేసేటప్పుడు తీసిన వీడియో అని తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య సినిమాలో శృతి హాసన్ చిరు సరసన నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి.. దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు హిట్​ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details