Upcoming Telugu Love Movies : ఇప్పట్లో రిలీజవుతున్న అన్నీ సినిమాలు దాదాపు పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే ఏ లాంగ్వేజ్ సినిమాను అయినా ప్రేక్షకులు బాక్సాఫీస్ ముందు టాప్ పొజిషన్లో నిలబెడుతున్నారు. దీంతో దర్శక నిర్మాతల కూడా కొత్త కథలు.. కొత్త కొత్త ప్రయత్నాలతో ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటగా.. మరికొన్ని సినిమాలు ఇంకొన్ని బ్లాక్ బస్టర్లను క్రియేట్ చేసేందుకు ముందుకొస్తున్నాయి.
Upcoming Telugu Romantic Movies : అయితే థియేటర్లలో ఎంత గొప్ప కథలు వచ్చినా కూడా తెలుగు సినిమాల్లో మాత్రం లవ్ స్టోరీస్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కమర్షియల్ సినిమాలను పక్కనబెడితే.. మనసుకు హత్తుకునే ప్రేమ కథలకు టాలీవుడ్ పెట్టింది పేరు. స్టార్స్‌తో సంబంధం లేకుండా.. ఏదైనా మంచి ప్రేమ కథని తెరకెక్కిస్తే ఆడియెన్స్ ఆ సినిమాను కచ్చితంగా హిట్ చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఎన్నో యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు తెరపైన కనిపిస్తున్న వేళ మళ్లీ తెలుగు సినిమాల్లో కొత్త ప్రేమలు చిగురించనున్నాయి. ఈ క్రమంలో పలు లవ్ జానర్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం కానున్నాయి. అవేంటంటే..
Prabhas Hanu Raghavapudi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో హను రాఘవపుడి ఓ సినిమా చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో లవ్ స్టోరీగా ఇది రానుందట. ఈ సినిమాలో కూడా 'సీతారామం'లా ఆర్మీ బ్యాక్ డ్రాప్‌ను టచ్ చేయనున్నారట.
Chandoo Mondeti Naga Chaitanya : నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ కూడా ఓ అద్భుతమైన లవ్ స్టోరీతో తెరకెక్కనుందని సమాచారం. శ్రీకాకులం నేపథ్యంలో సాగే ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.