ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ వైపే చుసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియన్ సినిమా అంటే రీజినల్ భాషల్లో తెరకెక్కుతున్న భారీ సినిమాల వైపే చూస్తోంది సినీ జగత్తు. బాహుబలి దెబ్బతో రీజినల్ సినిమా కాస్త ఇండియన్ సినిమాగా మారిపోయింది. తెలుగు రేంజ్‌ను బాహుబలి ఎలా మార్చిందో.. కన్నడ సినిమాల రేంజ్‌ను 'కేజీఎఫ్' అలాగే చేసింది. తాజాగా వచ్చిన 'కాంతార' అద్భుత విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కన్నడ సినిమాలపైనే ఉంది. అయితే కన్నడలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలు ఇవే. ఓ లుక్కేయండి.
ప్రొడక్షన్ నంబర్1
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కార్తిక్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. సుధీర్ చంద్ర పదిరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఏఏ04
కన్నడ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం ఏఏ04. అభిషేక్ అంబరీశ్ కథానాయకుడిగా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఈ చిత్రం రూపొందుతోంది. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాఘవేంద్ర వి స్వరాలు సమకూర్చుతున్నారు.
వేధ
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వేధ'. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ సరసన గనవి లక్షణ్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఉమశ్రీ, అధితి సాగర్, రఘు శివమొగ్గ, జగ్గప్ప, చెలువరాజ్. భరత్ సాగర్, ప్రసన్న, వినయ్, సంజీవ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. గీత శివరాజ్ కుమార్, జీ స్టుడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సప్తసాగరచ్చే ఎల్లో
కన్నడ నుంచి వస్తున్న మరో చిత్రం 'సప్తసాగరచ్చె ఎల్లో'. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను హేమంత్ ఎమ్ రావు డైరెక్ట్ చేస్తున్నారు. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పుష్కర మల్లికార్జునయ్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 18 నవంబర్ 2022న విడుదలకు సిద్ధంగా ఉంది.
మార్టిన్