తెలంగాణ

telangana

జూన్​ టు సెప్టెంబర్​.. కొత్త సినిమాల జోరు.. ప్రభాస్​ మూవీలతోనే స్టార్ట్​ & ఎండ్​!

By

Published : Jun 7, 2023, 5:10 PM IST

Updated : Jun 7, 2023, 8:03 PM IST

Upcoming Movies 2023 : జూన్​ టు సెప్టెంబర్​.. ఈ నాలుగు నెలల్లో టాలీవుడ్​లో వరుసపెట్టి సినిమాలు రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటంటే?

upcoming telugu movies 2023 list
upcoming telugu movies 2023 list

Upcoming Movies 2023 : వేసవిలో చల్లదానాన్ని ఇచ్చేందుకు ఎన్నో కూల్​ మూవీస్​ బాక్సాఫీస్​ వద్ద పోటీ పడ్డాయి. సినీ ప్రేక్షకులను అలరించేందుకు ఎంతో ప్రయత్నించాయి. కానీ అందులోని కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లను అందించలేకపోయాయి. దీంతో ఇక రానున్న నెలల్లో కొత్త చిత్రాల కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు థియేటర్లలో సందడి చేయనున్న సినిమాల లిస్ట్​ మీకోసం..

  • Adipurush Movie Release Date : జూన్​ రెండో వారంలో రెండు సినిమాలు పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూన్​ 15న హాలీవుడ్​ మూవీ 'ప్లాష్'​ రిలీజౌతుండగా.. మరుసటి రోజు మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్'​ విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ఇండియాతో పాటు ఓవర్సీస్​లోనూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. విదేశాల్లో ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుక్కింగ్స్​ కూడా మొదలయ్యాయి.
  • SPY Movie Release Date : అదే నెల ఆఖరి వారంలో నిఖిల్​ నటించిన టాలీవుడ్​ మూవీ 'స్పై' విడుదల కానుంది. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగున్న మిస్టరీని ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా జూన్‌ 29న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • BRO Movie Release Date : పవర్ స్టార్​ పవన్​ కల్యాణ్​, సుప్రీమ్​ హీరో సాయి ధరమ్​ తేజ్​ కాంబోలో వస్తున్న మూవీ 'బ్రో'. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 28న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ఆగస్ట్​, సెప్టెంబర్​.. బడా హీరోల సందడే సందడి..

  • Jailer Movie Release Date ఆగస్ట్​ నెల అంతా బడా హీరోల సినిమాలతో సందడే సందడి. సూపర్ స్టార్​ రజనీ కాంత్​ నటించిన 'జైలర్'​ సినిమా ఆగస్ట్​​ 10న రిలీజవ్వనుండగా.. మరుసటి రోజు మెగాస్టార్​ చిరంజీవి 'భోళా శంకర్'​తో పాటు రణ్​బీర్​ కపూర్​ 'యానిమల్'​ బాక్సాఫీస్​ వద్ద పోటీ పడనున్నాయి.
  • Kushi Movie Release Date : రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, స్టార్​ హీరోయిన్​ సమంత​ నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్​ 1న విడుదలవ్వనుండగా.. 7వ తేదీన షారుక్​ ఖాన్​ మూవీ 'జవాన్'​ రిలీజ్​ కానుంది.
  • Salaar Movie Release Date : సెప్టెంబర్​ రెండో వారం మాత్రం అభిమానులకు గూస్​బంప్స్​ తెప్పించే సినిమా ఒకటి రిలీజవ్వనుంది. అదే ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'సలార్​'. సెప్టెంబరు 28న ప్రేక్షకుల మందుకు రానుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్కేర్​ 15వ తేదీన రిలీజ్​ కానుంది. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ నాలుగు నెలల్లో రిలీజ్​ల సందడి ప్రభాస్ సినిమాతో మొదలై ప్రభాస్ సినిమాతోనే ముగుస్తోంది.
Last Updated : Jun 7, 2023, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details