తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య 'అన్​స్టాపబుల్'​ క్రేజ్​.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు - అన్​స్టాబుల్ ప్రతిష్ఠాత్మక అవార్డు బాలకృష్ణ

Unstoppable with NBK awards: 'అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే' ఓ ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన రెండు సిల్వర్​ ట్రోఫీలను సొంతం చేసుకుంది.

Unstoppable with NBK awards
అన్​స్టాపబుల్​కు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు

By

Published : May 10, 2022, 7:54 AM IST

Unstoppable with NBK awards: నందమూరి బాలకృష్ణ మొదటిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్‌ షో 'అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే'. 'ఆహా' ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ కార్యక్రమం 'మోస్ట్‌ వాచ్డ్‌ షో'గా అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందింది. టాక్​ షోలలో నెం.1గా రికార్డులు కూడా సృష్టించింది! అదే సమయంలో దీని ద్వారా బాలయ్య హోస్ట్​గా సూపర్​ క్రేజ్​ సంపాదించుకున్నారు.

అయితే తాజాగా ఈ కార్యక్రమం ఓ ఘనత సాధించింది. బెస్ట్​ రీజనల్​ టీవీ ప్రోగ్రామ్​, బెస్ట్​ రీజనల్​ టీవీ రియాలిటీ షో ప్రోమో కెటగిరీల్లో.. రెండు సిల్వర్​ ట్రోఫీలను ముద్దాడింది. ​గోవా ఫెస్ట్​ 2022లో భాగంగా ప్రతిష్టాత్మకమైన అడ్వర్టైజింగ్​ అండ్​ మార్కెటింగ్​ అవార్డ్స్​ షో-అబ్బి వన్​ షో అవార్డ్స్ కార్యక్రమంలో వీటిని సొంతం చేసుకుంది. ప్రముఖ రేటింగ్​ సంస్థ ఐఎమ్​డీబీలోనూ రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఆహా సోషల్​మీడియాలో పోస్ట్ చేస్తూ హర్షం వ్యక్తం చేసింది. 'అన్​స్టాపబుల్​ జర్నీకి ఇది కేవలం ప్రారంభం మాత్రమే' అని క్యాప్షన్​ జోడించింది.

కాగా, ఈ షో ఇప్పటికే విజయవంతంగా తొలి సీజన్​ను పూర్తి చేసుకుంది. అల్లుఅర్జున్, రాజమౌళి, రవితేజ, మహేశ్​బాబు, రష్మిక, రానా, సుకుమార్​, బోయపాటి, అనిల్​ రావిపూడి, దేవరకొండ, పూరిజగన్నాథ్​ సహా పలువురు స్టార్స్​​ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సీజన్ కూడా​ త్వరలోనే ప్రారంభంకానుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, తదితరులు గెస్ట్​లుగా వచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది.

ఇదీ చూడండి: 'అన్​స్టాపబుల్' షోలో బాలయ్య-చిరు ఎపిసోడ్ అందుకే కుదర్లేదు!

ABOUT THE AUTHOR

...view details