తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అప్పుడే పెళ్లి చేసుకుంటా!'.. అన్​స్టాపబుల్​లో ప్రభాస్.. 'డార్లింగ్ బాలయ్య'తో సందడి - Unstoppable with NBK S2 prabhas guest

నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్​స్టాపబుల్-2​ ప్రోమో విడుదల అయ్యింది. ఈ కొత్త ఎపిసోడ్​కు పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్​ హీరో గోపీచంద్​ హాజరయ్యారు. ఇద్దరికీ క్రేజీ ప్రశ్నలు సంధించారు బాలకృష్ణ. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది. మీరూ చూసేయండి..

Unstoppable Prabhas Gopichand Episode Promo
Unstoppable Prabhas Gopichand Episode Promo

By

Published : Dec 17, 2022, 7:07 PM IST

Updated : Dec 18, 2022, 9:34 AM IST

'అన్​స్టాపబుల్2'​ టాక్​ షోతో అప్రతిహతంగా దూసుకెళ్తున్నారు. నటిసింహం బాలకృష్ణ. తాజాగా ఆ షోకు పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ వచ్చారు. ఆయనతో పాటు టాలీవుడ్​ ప్రముఖ హీరో, ప్రభాస్​ స్నేహితుడు గోపీచంద్ కుడా హారయ్యారు. ఈ మేరకు ఓటీటీ సంస్థ 'ఆహా' ప్రోమో విడుదల చేసింది. అందులో ప్రాభాస్​ను ఓ రాజులాగా షోలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. అప్పటినుంచి క్రేజీ ప్రశ్నలతో ప్రభాస్​, గోపీ చంద్​ను ఆడుకున్నారు బాలయ్య. ఆ ప్రశ్నలకు అంతే క్రేజీగా జవాబులు ఇచ్చారు ప్రభాస్, గోపీచంద్​.

అప్పుడే పెళ్లి చేసుకుంటా అనుకుంటా..!
'ఇక నన్ను కూడా డార్లింగ్ అనే పిలవాలి' అని ప్రభాస్‌ను బాలకృష్ణ కోరారు. దానికి ప్రభాస్ 'అలాగే డార్లింగ్ సార్' అని రిప్లై ఇచ్చారు. 'మొన్న శర్వానంద్​ వచ్చినప్పుడు.. పెళ్లి ఎప్పుడు అని అడిగాను.. ప్రభాస్​ తర్వాత అన్నాడు' బాలయ్య చెప్పారు. దీనికి ప్రభాస్​ స్పందిస్తూ.. 'నేను సల్మాన్​ ఖాన్​ తర్వాత అనాలేమో ' అని నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత రామ్​చరణ్​కు ఫోన్​ చేశారు బాలకృష్ణ.. దీంతో 'ఓయ్ చరణ్​.. నున్​ ఫ్రెండ్​వా శత్రువువా' అని అన్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రేక్షకులకు ఫుల్​ కిక్​ను అందించింది. అయితే, ఇటీవల తుది శ్వాస విడిచిన రెబల్​ స్టార్​ కృష్ణంరాజును గుర్తు చేసుకుని ప్రభాస్​ కాస్త ఎమోషనల్​ అయ్యారు. ప్రోమో చివర్లో బుజ్జిగాడు సినిమాలోని 'ఏవండీ.. ఒక పాట పాడండి' అంటూ డైలాగ్​ చెప్పారు.

త్వరలో పవన్​ కల్యాణ్..!
ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీన విడుదల కానుంది. ఈ ఎపిసోడ్​ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నామని ఫ్యాన్స్​ కామెంట్లు పెడుతున్నారు. కాగా, త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కూడా ఒక ఎపిసోడ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Dec 18, 2022, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details