బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షోకు ఎందరో రాజకీయ నాయకులు, సెలబ్రటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఒక్కొ ఎపిసోడ్ ఒక్కో బ్లాక్‌బస్టర్‌గా ఉంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే ప్రభాస్ గెస్ట్‌గా రానున్నట్లు ఓ అప్డేట్ వచ్చింది. ఇక అంతే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. ఒకటా, రెండా.. ట్రైలర్, టీజర్ అంటూ వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్కు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు.
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. రెండు భాగాలుగా 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్ - అన్‌స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ పార్డ్ 2
ప్రభాస్ గెస్ట్‌గా రానున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఆ సంగతులు మీకోసం...
అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఆహా సంస్థ. అదేంటంటే..ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేసింది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ది బిగినింగ్ అండ్ ద కంక్లూజన్‌గా రిలీజ్ కానున్న ఈ వంద నిమిషాల నిడివి గల ఫస్ట్ పార్ట్‌ను డిసెంబర్ 30న రీలీజ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ఇందులో బాలకృష్ణ, ప్రభాస్ మధ్య సరదా చిట్‌చాట్‌తో పాటు ప్రభాస్ కెరీర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నట్లు సమాచారం. మరో వైపు జనవరి 6న విడుదల కానున్న సెకండ్ పార్ట్‌లో ప్రభాస్, గోపీచంద్ స్నేహంతో పాటు ఇండస్ట్రీలోకి వారిద్దరి ఎంట్రీ గురించి బాలయ్యతో షేర్ చేసుకోనున్నట్లు టాక్.