Unstoppable With NBK Latest Episode : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'. రెండు సీజన్లు నిర్విరామంగా జరిగిన ఈ షో ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తోంది. ఇప్పటికే 'యానిమల్' మూవీ టీమ్‌తో ఓ ఎపిసోడ్ విడుదలై సందడి చేయగా తాజాగా మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు ఎవరు గెస్టులుగా రానున్నారన్న విషయాన్ని తాజాగా ఓ స్పెషల్ వీడియోతో రివీల్ చేశారు. "మిస్టరీ రివీల్ అయిపోయింది. ఇప్పుడీ స్టార్స్ తో అన్‌స్టాపబుల్ సరదాకి మీరు రెడీనా? అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే త్వరలోనే ఆహాలో రాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ ఎపిసోడ్ ప్రోమోను పోస్ట్ చేశారు.
అందులో స్టార్ హీరోయిన్ శ్రియ, సీనియర్ నటి సుహాసిని, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఉన్నారు. వీరితో పాటు 'లక్ష్మీ నరసింహ' మూవీ డైరెక్టర్ జయంత్ కూడా ఈ షోలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా బాలయ్య శ్రియ ఉన్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ 'చెన్నకేశవ రెడ్డి', 'పైసా వసూల్' సినిమాలో జోడీగా కనిపించి అలరించారు. దీంతో ఈ కాంబోను ఇలా స్క్రీన్‌పై చూడటం ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా మంగమ్మ గారి మనవడు సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుహాసిని బాలయ్య పేయిర్ కూడా ఈ సెట్స్‌పై చూడొచ్చంటూ కామెంట్లు పెడుతున్నారు.