తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నేను, రణ్​బీర్ ఆశ్చర్యపోయాం - బాలయ్య అంటే తెలిసింది': సందీప్​రెడ్డి - అన్​స్టాపబుల్ షో యానిమల్ ఎపిసోడ్

Unstoppable With NBK Animal : 'అర్జున్ రెడ్డి' సినిమాతో ట్రెండ్‌ సెట్టర్‌ అనిపించుకున్నారు డైరెక్టర్​ సందీప్​రెడ్డి వంగా. తాజాగా ఆయన రణ్​బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా.. రీసెంట్​హా అన్​స్టాపబుల్​ షో లో పాల్గొన్న సందీప్​.. షో హోస్ట్ బాలకృష్ణతో జరిగిన సంభాషణల గురించి చెప్పారు.

Unstoppable With NBK Animal
Unstoppable With NBK Animal

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 7:36 AM IST

Updated : Nov 26, 2023, 9:29 AM IST

Unstoppable With NBK Animal : 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా గుర్తింపు పొందారు డైరెక్టప్ సందీప్​రెడ్డి వంగా. ఇదే సినిమాని 'కబీర్ సింగ్​' గా బాలీవుడ్​లో రీమేక్ చేసి అక్కడా హిట్​ అయ్యారాయన. తాజాగా సందీప్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ - రష్మికా మందన్నా జంటగా 'యానిమల్' సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా.. రణ్​బీర్, రష్మికా, సందీప్​రెడ్డి రీసెంట్​గా తెలుగు టాక్​ షో అన్​స్టాపబుల్​కు వచ్చారు.

ఈ​ ప్రోగ్రామ్​లో వారి మధ్య జరిగిన కొన్ని ఆసక్తికర సందర్భాల గురించి చెప్పారు దర్శకుడు సందీప్​. 'బాలకృష్ణ సర్‌ చేస్తున్న 'అన్‌స్టాపబుల్‌' షోకి వెళ్లినప్పుడు నేను షాక్‌ అయ్యా. బాలకృష్ణ అనగానే సీరియస్‌గా ఉంటారని అందరం అనుకుంటాం. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాతే ఆయన ఎంత సరదాగా ఉంటారో తెలిసింది. నిజంగా ఈ షో డిజైన్‌ చేసిన వాళ్లకి హ్యాట్సాఫ్‌. రణ్‌బీర్‌ కపూర్‌ ముత్తాత చెప్పిన 'మొఘల్‌ ఎ అజమ్‌' సంభాషణలు బాలకృష్ణ సర్‌ చెబుతుంటే నేను ఆశ్చర్యపోయా. రణ్​బీర్​ కూడా.. 'నాకే ఒక్క డైలాగ్‌ తెలీదు, ఆయన ఇలా చెప్పారేంటి?' అని షాక్​ అయ్యాడు.

నేను ట్రై చేశా.. సందీప్ రిజెక్ట్ చేశారు.. 'యానిమల్' సినిమా తెలుగులో డబ్బింగ్ చెబుతానని రణ్​బీర్ అన్నారట."నేను తెలుగులో డబ్బింగ్ చెబుతానన్నా. సందీప్ రిజెక్ట్​ చేశారు. కానీ, రష్మిక నాకు రోజుకు ఒక పదం 'అందరికి నమస్కారం', 'చెప్పు','ఏంటి' ఇలా నేర్పించేది" అని రణ్​బీర్ అన్నారు. రష్మక తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పిందని సందీప్ అన్నారు. ఇక యానిమల్ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పి.. తెలుగు ఇండస్ట్రీలోకి రణ్​బీర్​కు బాలకృష్ణ స్వాగతం పలికారు.

Animal Movie Cast : నటుడు బాబీ దేఓల్, త్రిప్తి దిమ్రి, పరిణితి చోప్రా, అనిల్ కపూర్, శరత్ సక్సెనా తదితరులు నటించారు. ఈ సినిమా హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో పాన్ ఇండియా లెవెల్​లో డిసెంబర్ 1న గ్రాండ్​గా థియేటర్లలో విడుదల కానుంది.

'ప్రభాస్ అన్నతో నటించాలని ఉంది'!: రణ్​బీర్ - 'స్పిరిట్​' షూటింగ్ అప్​డేట్ వచ్చేసిందోచ్

'అన్​స్టాపబుల్​' సెట్​లో రణ్​బీర్​, రష్మిక - స్ట్రీమింగ్ డేట్ వచ్చేసిందోచ్

Last Updated : Nov 26, 2023, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details