తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు ఈ మాస్ హీరోలు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు ఎదురుపడి సంభాషించుకుంటుంటే ఏమవుతుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల మనసుల్లో మెదులుతున్నాయి. ఆ ఇద్దరే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నటసింహం బాలకృష్ణ. వీరిద్దరూ బుల్లితెరపై సందడి చేసేలా ఉన్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్' ఇందుకు వేదికయ్యే అవకాశముంది. అయితే దీని గురించి హింట్ రెండో ఎపిసోడ్‌లోనే వచ్చింది. కాగా, దాన్ని నిజం చేసేలా ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ తేదీ కూడా నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 27న ఈ ఎపిసోడ్ చిత్రీకరణ జరగబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో పవర్ స్టార్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, క్రిష్ జాగర్లమూడి కూడా సందడి చేయనున్నారట.