నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద 'వీర సింహా రెడ్డి'గా సినిమా... డిజిటల్ స్క్రీన్ మీద అన్స్టాపబుల్లో తన మూవీటీమ్తో కలిసి సందడి చేయనున్నారు. తాజాగా ఈ షో కొత్త ఎపిసోడ్కు వీరసింహారెడ్డి టీమ్ అతిథులుగా విచ్చేసి సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హీరోయిన్లు హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని ఉన్నారు. సంక్రాంతికి వచ్చే బాలకృష్ణ సినిమా నిజమైన 'అన్‌స్టాపబుల్' అంటూ మొదలైన ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆసక్తిగా సాగింది. ఇందులో బాలయ్య.. మలయాళ భామ హానీ రోజ్తో కలిసి స్టెప్పులు వేశారు.
ఇంటర్వెల్ ఓకే చేసినప్పుడే బ్లాక్ బస్టర్.. 'వీర సింహారెడ్డి' ఇంటర్వెల్ సీన్ చెప్పినప్పుడు బాలకృష్ణ ఓకే చేశారని, అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అనే నిర్ణయానికి తాను వచ్చినట్లు గోపీచంద్ మలినేని అన్నారు. అప్పుడు 'ఇప్పుడు సినిమా కుమ్మేశావ్. నన్ను నానా కుమ్ముడు కుమ్మేశావ్' అంటూ బాలయ్య సరదా సంభాషణ చేశారు. దీని తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని కాసేపు ఎమోషనల్ అయ్యారు. 'క్రాక్' విడుదలకు ముందు తన ఆస్తిని అమ్మిన విషయాన్ని, పడిన ఇబ్బందులను గుర్తు చేయడంతో కంటతడి పెట్టుకున్నారు.