తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2022, 4:57 PM IST

ETV Bharat / entertainment

బాలయ్య 'అన్​స్టాపబుల్​ 2' ట్రైలర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తన్న అన్​స్టాపబుల్ టాక్​ షో ట్రైలర్​ దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ ప్రచార చిత్రాన్ని ఎవరు డైరెక్ట్​ చేస్తున్నారంటే?

balayya unstoppable trailer
బాలయ్య అన్​స్టాపబుల్ ట్రైలర్​

నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో 'అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ఆహాలో ప్రసారమైన ఈ టాక్‌ షో విశేష ప్రజాదరణ పొందింది. తనదైన మ్యానరిజం, పంచ్​ డైలాగ్స్​తో బాలయ్య ప్రేక్షకులను బాగా అలరించారు. దీంతో రెండో సీజన్​పై ఫ్యాన్స్​లో అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే సీజన్​కు సంబంధించిన యాంథమ్​ను రిలీజ్​ చేసి ప్రేక్షకుల్లో జోష్ నింపారు మేకర్స్​. దసరా కానుకగా ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారు.

అయితే దీనికి కూడా తొలి సీజన్​ ప్రచార చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్​ వర్మకే ఈ బాధ్యతలు అప్పగించింది ఆహా. ఎందుకంటే తొలి ట్రైలర్​లో బాలయ్యలోని ఫుల్ ఎనర్జీని డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేశారు ప్రశాంత్. ఆ ట్రైలర్​కు వచ్చిన స్పందనను రెట్టింపు చేస్తూ, షో సైతం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది.

ట్రైలర్ 2 తెరకెక్కించడంపై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. "బాలకృష్ణతో అన్ స్టాపబుల్ సీజన్ 1 ట్రైలర్ చేయడం గొప్ప ఆనందాన్ని కలిగించింది. రెండో సీజన్ ట్రైలర్ షూట్ చేసే ఛాన్స్ కూడా నాకే రావాలని బలంగా అనుకున్నాను. అలానే ఆ అవకాశం నాకు దక్కింది. దీని కోసం ఓ మంచి కథ రాయమని ఆహా టీమ్ అడిగింది. నేను ట్రైలర్ చిత్రీకరణ కోసం రాసిన కథ వారికి నచ్చడం వల్ల ప్రచార చిత్రం తీయగలిగాను. విజయవాడలో ఈ నెల 4వ తేదీ దీని ఆవిష్కరణ ఉంటుంది. అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు. కాగా, ప్రశాంత్.. 'దీనమ్మ జీవితం' అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత 'అ', 'కల్కి', 'జాంబిరెడ్డి' వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం 'హను-మాన్', 'అధీర' చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

బాలయ్య అన్​స్టాపబుల్ ట్రైలర్​

ఇదీ చూడండి: అల్లు ఫ్యామిలీపై మెగాస్టార్​ చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్​.. ఏమన్నారంటే..

ABOUT THE AUTHOR

...view details