UK Movie Festival Mutthayya Movie: భారీ బడ్జెట్ చిత్రాలే కాదు, అప్పుడప్పుడు కొన్ని చిన్న చిత్రాలు కూడా అరుదైన ఘనత సాధిస్తున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది 'ముత్తయ్య'. కె.సుధాకర్‌రెడ్డి కీలక పాత్రలో భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. మే 9న ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా అగ్ర కథానాయిక కాజల్ 'ముత్తయ్య' సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా తెర ముందు ఓ వృద్ధుడిని నిలబడి చూస్తున్న పోస్టర్ ఆసక్తిని కలిగిస్తోంది. అరుణ్ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగమ్‌శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Nagachaitanya Webseries Amazon Prime: హీరో నాగచైతన్య ఈ ఏడాది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నాగచైతన్య కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు ఎనిమిది నుంచి పది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ తెరకెక్కించునున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు 'దూత' అనే పేరును ఖరారు చేశారు.
ఇదిలా ఉండగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్నట్లు తెలిసింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని, అతి త్వరలోనే స్ట్రీమింగ్‌చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో నాగచైతన్యకు జోడీగా ప్రియాభవానీ శంకర్ నటిస్తున్నారు. కెరీర్‌లో నాగచైతన్య అంగీకరించి తొలి హారర్ కథాంశమిదే కావడం గమనార్హం.