UI The Movie Teaser :కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'యూఐ: ది మూవీ'. ఈ సినిమా టీజర్‌ను వినాయకచవితి సందర్భంగా చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల టీజర్, ట్రైలర్ రిలీజ్ అంటే భారీ అంచనాలు పెట్టుకుంటారు ఫ్యాన్స్. దీనికి తగ్గట్టే అటు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా వీటిల్లో సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా ఉండే డైలాగ్స్, సీన్స్ ఉండేలా చూసుకుంటారు.
కానీ, హీరో కమ్ డైరెక్టర్‌గా మారిన ఉపేంద్రమాత్రం తన అప్‌కమింగ్ మూవీ 'UI'టీజర్‌లో మాత్రం అవేవీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2 నిమిషాల 17 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ప్రస్తుతం ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక్కటంటే ఒక్క విజువల్ కూడా లేకుండానే ఈ విచిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ వీడియోలో కేవలం సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. దీంతో కళ్లు మూసుకొని కూడా ఈ టీజర్‌ను చూడవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.