తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వేధించిన అభిమాని.. చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్​! - కోజికోడ్​ హైలైట్​మాల్​ లో ఇద్దరు నటులపై వేధింపులు

సినిమా ప్రమోషన్​లో భాగంగా ఓ మాల్​కు వెళ్లిన ఇద్దరు యువ నటీమణులు వేధింపులకు గురయ్యారు. అయితే వారిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక నటి తనను వేధించిన వాళ్ల చెంప చెళ్లు మనిపించింది.

Two actors were molested in kerala
Two actors were molested in kerala

By

Published : Sep 28, 2022, 3:08 PM IST

కేరళలో ఇద్దరు యువ నటీమణులపై వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. సినిమా ప్రమోషన్​లో భాగంగా కొజికోడ్​లోని ఓ మాల్​కు వెళ్లగా ఈ ఘటన జరిగింది. ఈవెంట్​ అనంతరం బయటకు వస్తుండగా నటీమణులను వేధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక నటి తనను వేధించిన వాళ్ల చెంపను చెళ్లు మనిపించింది. శనివారం జరిగిన ఈ ఘటన.. వీడియో వైరల్​ కావడం వల్ల వెలుగులోకి వచ్చింది.

వేధింపులకు గురైన నటి మాట్లాడుతూ.. "నేను మా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా హైలైట్​ మాల్​కు వెళ్లాం. ఈ కార్యక్రమానికి భారీగా జనం వచ్చారు. వాళ్లను హ్యాండిల్ చేయడానికి సెక్యూరిటీ చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్ ముగిశాక బయటకు వెళ్లేటప్పుడు.. మా టీమ్​లోని ఓ నటితో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత నాకు కూడా అలాగే జరిగింది. ఆ గుంపులో వారిని గుర్తించేందుకు వీలు కాలేదు. మాకు జరిగినట్టు ఎవ్వరికి జరగకూడదు. ఇలా మహిళను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఆవేదన వ్యక్తం చేసింది.

వేధింపులకు గురైన మరో నటి కూడా స్పందించింది. "హైలైట్​ మాల్​లో ఈ రోజు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఆ గుంపులో నన్ను ఒకడు తాకాడు. అతడు ఎక్కడ టచ్​ చేశాడో నేను చెప్పలేను. మన చుట్టూ ఉన్న వాళ్లు ఇలా ఉన్నారా? సినిమా ప్రమోషన్స్​ కోసం నేను చాలా ప్రాంతాలు తిరిగాను. కానీ ఇంత దారుణమైన అనుభవం ఎప్పుడు కలగలేదు. నా తోటి నటికి ఇలాగే జరిగింది. అది ఆమె బయటకు చెప్పుకుంది. కానీ నా పరిస్థితుల కారణంగా నేను చెప్పుకోలేదు. కొద్ది సేపు నాకు ఏం చేయాలో తోచలేదు. మీ జబ్బు తగ్గిందా?" అని ఇన్​స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది.

కేరళలో ఇద్దరు నటీమణులపై వేధింపులు

ఇవీ చదవండి:ఈ బ్యూటీకి వయసు తరుగుతోంది.. అందం పెరుగుతోంది

మహేష్​బాబు తల్లి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details