తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలీవుడ్​లో విషాదం.. షూటింగ్ సెట్​లో టీవీ నటి ఆత్మహత్య - దబాంగ్​ నటి తునీషా శర్మ ఆత్మహత్య

బాలీవుడ్​లో విషాదం జరిగింది. మరాఠీ బుల్లితెర నటి తునీషా శర్మ(21) ఆత్మహత్యకు పాల్పడింది.

tv actress tunisha sharma
tv actress tunisha sharma

By

Published : Dec 24, 2022, 7:12 PM IST

Updated : Dec 24, 2022, 8:51 PM IST

బాలీవుడ్​లో విషాదం జరిగింది. మరాఠీ బుల్లితెర నటి తునీషా శర్మ(21) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పల్ఘర్​ జిల్లాలో జరిగింది. సీరియల్ షూటింగ్​ జరుగుతున్న సెట్​లో టాయిలెట్​లోకి వెళ్లిన తనీషా.. ఎంతకూ బయటకు రాలేదు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఘటనపై వాలివ్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్​ నోట్​ లాంటిదేది లభించలేదని తెలిపారు. ఆత్మహత్యతో పాటు హత్య కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. తునీషా చనిపోయిన సమయంలో సెట్​లో ఉన్న వారందరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

నటి తునీషా శర్మ.. 'అలి బాబా దస్తాన్' అనే పాపులర్ టీవీ షో​లో షెహ్​జాదీ మరియంగా నటించింది. ​'భారత్​ కా వీర్​ పుత్ర- మహా రాణా ప్రతాప్​' అనే చారిత్రాత్మక సీరియల్​తో బుల్లితెరకు పరిచయమయింది. ఆ తర్వాత చక్రవర్తి అశోక్​ సమ్రాట్​, గబ్బర్​ పూంచ్​వాలా, షేర్​-ఇ-పంజాబ్​ మహారాజా రంజిత్​ సింగ్, ఇంటర్నెట్​ వాలా లవ్, ఇష్క్​ సుభానల్లా సీరియల్స్​లో మెరిసింది. టీవీ సీరియళ్లే కాకుండా ఫితూర్​, బార్​ బార్​ దేఖో, కహాని 2, దుర్గ రాణి సింగ్, దబాంగ్​ 3 లాంటి సినిమాల్లో నటించింది. దబాంగ్​లో 3 కత్రినా కైఫ్​ చిన్నప్పటి పాత్రలో నటించింది.

Last Updated : Dec 24, 2022, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details