తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నటి సాయిపల్లవి పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - ts high court dismissed sai pallavi petition

high court dismissed sai pallavi petition: వివాదస్పద వ్యాఖ్యల కేసులో నటి సాయిపల్లవి పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. భజరంగ్ దళ్ సభ్యుడి ఫిర్యాదుతో గత నెలలో సుల్తాన్‌బజార్ పీఎస్‌లో కేసు నమోదు అయింది. నటి సాయిపల్లవికి గత నెల 21న నోటీసులు జారీ చేసిన సుల్తాన్‌బజార్ పోలీసులు.. నోటీసులు రద్దు చేయాలని సాయిపల్లవి హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులు రద్దు చేయాలన్న నటి సాయిపల్లవి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

high court dismissed sai pallavi petition
high court dismissed sai pallavi petition

By

Published : Jul 7, 2022, 9:49 PM IST

high court dismissed sai pallavi petition: సినీనటి సాయి పల్లవి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో పాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు భజరంగ్‌దళ్‌ నాయకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. భజరంగ్‌దళ్‌ నాయకుల ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు సాయిపల్లవికి గత నెల 21న నోటీసులు జారీ చేశారు. దీంతో నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇంతకీ సాయి పల్లవి ఏమన్నారంటే?

తాను ప్రధాన పాత్ర పోషించిన ‘విరాటపర్వం’ సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్‌.. సాయి పల్లవి నేపథ్యం గురించి ప్రశ్నించగా ఆమె స్పందించారు. లెఫ్ట్‌వింగ్‌, రైట్‌వింగ్‌ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్‌గా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా గురించి మాట్లాడారు. ‘‘90ల్లో కశ్మీర్‌ పండిట్లను ఎలా చంపారో ఆ చిత్రంలో చూపించారు కదా..! కొవిడ్‌ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలించారు. దాని డ్రైవర్‌ ఓ ముస్లిం. కొంతమంది అతడిని కొట్టి జై శ్రీరాం, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏముంది? మనం మంచిగా ఉండాలి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు’’ అంటూ సాయిపల్లవి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు: కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details