తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

త్రివిక్రమ్​కు కండిషన్​ పెట్టిన విజయ్​.. జోష్​లో సామ్​ ఫ్యాన్స్​ - samantha yashoda release date

త్రివిక్రమ్​తో రౌడీహీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. అయితే విజయ్​ మాత్రం ఓ కండిషన్ పెట్టారట. ఇకపోతే సమంత ఫ్యాన్స్​కు ఓ గుడ్​న్యూస్​. ఏంటంటే..

samantha yashoda release date
త్రివిక్రమ్​కు కండిషన్​ పెట్టిన విజయ్​.. జోష్​లో సామ్​ ఫ్యాన్స్​

By

Published : Oct 17, 2022, 6:50 PM IST

ఇటీవలై లైగర్​తో పరాజయాన్ని అందుకున్న టాలీవుడ్​ రౌడీహీరో విజయ్​ దేవరకొండ తన కొత్త సినిమాతో ఎలాగైనా హిట్​ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ యంగ్‌ హీరోకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. విజయ్‌ దేవరకొండకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఒక స్టోరీ లైన్‌ వినిపించారట. అది ఈ రౌడీ హీరోకి తెగ నచ్చేసిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.

అయితే త్వరలోనే త్రివిక్రమ్‌ ఈ సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, శశి కిరణ్‌ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని ఫిల్మింనగర్‌ టాక్‌. కానీ విజయ్‌ మాత్రం త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తేనే ఈ ప్రాజెక్టు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ప్రస్తుతం విజయ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు భారీస్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

రిలీజ్ డేట్​ సామ్​.. సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం 'యశోద'. నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హరి, హరీష్‌ ద్వయం దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి మూవీస్‌ సంస్థ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించారు మేకర్స్. నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను అలరించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సమంత యశోద రిలీజ్ డేట్​

ఇదీ చూడండి:పుష్ప 2 షూటింగ్ షురూ.. సింహంతో బన్నీ ఫైట్.. సీన్ చూస్తే గూస్​బంప్సే​!

ABOUT THE AUTHOR

...view details