Pawankalyan Trivikram movies : 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగుతుందని తెలిసినప్పటి నుంచి సోషల్‌మీడియాలో 'గుంటూరు కారం' వర్సెస్ 'ఉస్తాద్ భగత సింగ్' అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ ఎవరో అని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అదే సమయంలో అభిమానుల మనసులో పలు ప్రశ్నలు కూడా మెదులుతున్నాయి. అదేంటంటే.. ప్రచారంలో ఉన్నట్టుగానే 'ఉస్తాద్'ను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయితే.. షూటింగ్‌ను ఐదు నెలల్లోనే పూర్తి చేయాలి. అసలు ఇది సాధ్యమవుతుందా అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే బ్రో చిత్రాన్ని స్పీడు స్పీడుగా చిత్రీకరించి డివైడ్ టాక్ అందుకునేలా చేశారని, ఇప్పుడీ ఉస్తాద్ సింగ్ విషయంలోనూ ఇలానే చేస్తే వర్కౌట్ అవుతుందా అని తెగ ఆలోచిస్తున్నారు.
ఒకవేళ అనుకున్నట్టే ఉస్తాద్ భగత్ సింగ్.. సంక్రాంతికి వస్తే.. మహేశ్ బాబాకు 'గుంటూరు కారం'కు గట్టి పోటినిస్తుంది. అంటే 'మహేశ్ వర్సెస్ పవన్'తో పాటు 'త్రివిక్రమ్ వర్సెస్ పవన్' కూడా అవుతుందని అంతా అనుకుంటున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి ఇప్పటికే పలు చిత్రాలు కూడా చేశారు. రాజకీయాలకు సంబంధించి పవన్ మాట్లాడే ప్రతి మాట వెనక త్రివిక్రమ్ వ్యూహం ఉంటుందనే ప్రచారం కూడా బలంగానే ఉంది! మరి అంతటి స్నేహ బంధం ఉన్న త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమాకు.. పవన 'ఉస్తాద్'తో ఎదురెళ్తారా అనే ప్రశ్న కూడా సినీ ప్రియుల మదిలో మెదులుతోంది. ప్రస్తుతం అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు.