Trisha Injury: ఇటీవలే విదేశాలకు వెళ్లిన స్టార్ హీరోయిన్ త్రిష గాయంతో తిరిగొచ్చారు. టూర్‌లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. దీంతో వెకేషన్ మధ్యలోనే ఇంటికి చేరుకున్నారు.
ఈ క్రమంలో కాలికి పట్టి వేసి ఉన్న ఫొటోను త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. ప్రమాదం కారణంగా వెకేషన్ మధ్యలోనే రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక త్రిష షేర్ చేసిన ఫొటో చూసి ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు. 'గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ త్రిషకు ప్రమాదం.. వెకేషన్ మధ్యలోనే ఇంటికి వచ్చేసిన నటి - త్రిష లేటెస్ట్ వార్తలు
Trisha Injury: స్టార్ హీరోయిన్ త్రిష కాలు విరిగింది. ఇటీవలే వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన ఆమె.. గాయం కారణంగా మధ్యలోనే వచ్చేశారు.
Trisha Injury
స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 40కు చేరువవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటుతున్నారు. ఇటీవలే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా హిట్‌తో త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో త్రిష ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.