Trisha Mansoor Alikhan : స్టార్ హీరోయిన్ త్రిషపై 'లియో' నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం మన్సూర్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. దీనిని తొలగించాలంటే.. త్రిషకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది.
ఈ విషయంపై మన్సూర్ స్పందించాడు. "త్రిషకు క్షమాపణలు చెప్పేది లేదు. నడిగర్ సంఘం నిషేధం విధించేముందు నన్ను వివరణ అడిగి ఉంటే బాగుండేదన్నారు. నిషేధం ఎత్తివేసేందుకు నడిగర్ సంఘానికే కొంత వ్యవధి ఇస్తున్నాను. మీడియా నాకు వ్యతిరేకంగా నచ్చినట్లు రాసుకోవచ్చు. జనాలకు నేనేంటో తెలుసు. తమిళ ప్రజల మద్దుతు నాకు ఉంటుంది. సినిమాల్లో రేప్ సీన్ అంటే నిజంగా చేస్తారా? అలానే మర్డర్ సీన్ అంటే నిజంగా హత్య చేస్తారా? నేనేమి తప్పుగా మాట్లాడలేదు. క్షమాపణలు చెప్పేదీ లేదు." అని మన్సూర్ అలీఖాన్ అన్నారు.
త్రిషకు మద్దతుగా చిరు..
మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ.. త్రిషకు మద్దుతుగా మోగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఈ ఘటనపై స్పందించారు. "మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. కేవలం ఆర్టిస్ట్‌లకే కాకుండా స్త్రీలందరికీ అసహ్యం కలిగించేలా ఉన్నాయి. త్రిషకు మాత్రమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయి ఎదుర్కొన్నా.. నేను అండగా ఉంటాను." అని చిరంజీవి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.