Trisha Mansoor Ali Khan : 'లియో' నటుడు మన్సూర్ అలీ ఖాన్.. నటి త్రిష పై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఈ విషయంపై త్రిషతో పాటు పలు కోలీవుడ్ సినీ తారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మన్సూర్ అలీఖాన్ ఈ విషయంపై తాజాగా వివరణ ఇచ్చారు.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నారు. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు.. అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందంటే.. నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘లియో’లో త్రిషతో ఓ సీన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. "గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది." అని మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.