Rashmi Villa Gift Hero: కడుపుబ్బా నవ్వించే స్కిట్స్.. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్లు.. అలరించే పాటలు.. హృదయాల్ని హత్తుకునే వాస్తవిక గాథలతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈటీవీలో ప్రసారమవుతున్న పాపులర్ షో.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబైంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. సెలబ్రటీలు జంటలుగా రొమాంటిక్ పాటలతో డ్యాన్సులు, అదిరిపోయే స్టెప్పులతో అందర్నీ అలరించారు. చిన్నచిన్న గేమ్స్ ఆడుతా సందడి చేశారు.
అయితే ఈ ఎపిసోడ్లో గెస్ట్ ఇంద్రజ.. స్క్రీన్‌పై కొన్ని ఫొటోలు చూపిస్తూ పలు ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో 'యాంకర్ రష్మీకి ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్‌గా ఇచ్చారు ఆ హీరో ఎవరు?' అన్న ప్రశ్నతో ఫొటో డిస్ప్లే అయింది. ఆ ప్రశ్నకు రష్మీ సమధానం ఇచ్చింది. స్టేజ్ మీద ఉన్నవారందరూ రష్మీ సమధానంతో ఒక్కసారిగా షాకయ్యారు. మరి ఆ హీరో ఎవరో తెలియాలంటే.. ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు కోసం వేచి చూడాల్సిందే. ఈలోపు ప్రోమో చూసేయండి.