తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యంగ్​ టైగర్ బాలీవుడ్​​ ఎంట్రీ.. హృతిక్​ సినిమా సీక్వెల్​తో.. - వార్​ 2 మూవీ న్యూస్

యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ త్వరలో బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా ఓ స్టార్ హీరో సినిమా సీక్వెల్​లో. ఆ అప్డేట్​ మీ కోసం..

tollywood young tiger jr-ntr-joins-hrithik-roshan-in-war-2
jr ntr hritik roshan

By

Published : Apr 5, 2023, 12:23 PM IST

Updated : Apr 5, 2023, 1:44 PM IST

టాలీవుడ్​ యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ప్రస్తుతం ఓ వైపు 'ఆర్​ఆర్​ఆర్'​ సక్సెస్​ను ఆస్వాదిస్తూనే మరో వైపు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్​ 30' షూట్​లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్​ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలు నెట్టింట తెగ హల్​చల్​ చేస్తోంది. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ వార్త నిజమేనట. ఆయన బాలీవుడ్​లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నారట.​ అదీ కూడా బ్లాక్ బస్టర్ హిట్​ అయిన 'వార్' సినిమా సీక్వెల్​లో కనిపించనున్నారట. ఈ విషయాన్ని బాలీవుడ్​ క్రిటిక్​ తరణ్​ ఆదర్శ్​ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

వార్​ సినిమా మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమలో వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ సీన్స్​ తెరకెక్కాయి. అయితే ఇద్దరూ పోటా పోటీగా నటించినప్పటికీ.. చివరకి, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. అయితే అప్పట్లోనే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే తాజాగా వచ్చిన అప్డేట్​ ప్రకారం ఈ సినిమాలో యంగ్ టైగర్ మెరవనున్నారట. వీరిద్దరి మధ్య భారీ యాక్షన్​ సన్నీవేశాలు ఉంటాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ అంగీకరించారట.

ఎన్టీఆర్​ 31గా 'వార్​ 2' ?
ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్​ 30' షూట్​లో బిజీగా ఉన్నారు యంగ్​ టైగర్​. ఇక ఈ సినిమా తర్వాత 'కెజీయఫ్' డైరెక్టర్​ ప్రశాంత్ నీల్​తో ఓ సినిమాకు ఓకే చెప్పారు. 'సలార్' షూటింగ్​ కంప్లీట్ అయ్యాక..ఎన్టీఆర్ సినిమా సెట్స్​ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే దాని కంటే ముందే 'వార్ 2' షూటింగ్​లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ ఏడాది ఆఖరిలో 'వార్ 2'ను సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట.

'వార్​' కోసం 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు..
2019లో రిలీజైన 'వార్' సినిమాకు 'పఠాన్​' డైరెక్టర్​ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే రానున్న సీక్వెల్​కు మాత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శక - నిర్మాత ఆదిత్య చోప్రా కథ అందించారట. ఇక 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' అనే పేరుతో ఇండియన్ జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు యశ్ రాజ్ ఫిల్మ్స్ శ్రీకారం చుట్టింది. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' సినిమాలన్నీ ఆ యూనివర్స్​​లో భాగంగా తెరకెక్కినవే.

Last Updated : Apr 5, 2023, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details