తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షూటింగ్​లో అస్వస్థతకు గురైన హీరో నాగశౌర్య.. ఆస్పత్రికి తరలింపు - Nagashourya health condition

Hero Naga Shourya: టాలీవుడ్​ యువ హీరో నాగశౌర్య.. సినిమా సెట్స్​లో అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నాగశౌర్య అస్వస్థత
నాగశౌర్య అస్వస్థత

By

Published : Nov 14, 2022, 4:08 PM IST

Updated : Nov 14, 2022, 4:23 PM IST

Hero Naga Shourya: యువ నటుడు నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. సినిమా చిత్రీకరణలో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. చికిత్స కోసం ఆయన్ను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. తన కొత్త చిత్రంలోని పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకునేందుకు శౌర్య నాలుగు రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారని, అందువల్ల ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శౌర్య చేతిలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', 'నారీ నారీ నడుమ మురారి', 'పోలీసు వారి హెచ్చరిక', 'NS 24' (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలున్నాయి. అయితే ఇటీవలే నాగశౌర్యకు పెళ్లి ఫిక్స్​ అయినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నెల 20న బెంగళూరులోని ఓ ప్రైవేట్​ కల్యాణమండపంలో తన ప్రేయసి అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేయనున్నారు శౌర్య. పెళ్లికి ఇంకా తక్కువ రోజులే ఉన్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Last Updated : Nov 14, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details